నిఖిల్ 'స్పై' టీజర్ లాంచ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

వరుస విజయాలతో నిఖిల్ సిద్ధార్థ్ మంచి జోరు మీద ఉన్న విషయం తెలిసిందే.

ఈయన కెరీర్ ఈ మధ్య బాగా జెట్ స్పీడ్ తో ముందుకు వెళుతుంది అనే విషయం విదితమే.

ఈయన కెరీర్ లో కార్తికేయ 2( Karthikeya 2 ) సృష్టించిన సంచలనం అంతా ఇంత కాదు.తెలుగులో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోగా పేరు తెచ్చుకున్న నిఖిల్ ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు.

Nikhil’s Spy Teaser Will Be Launched On This Date And Time , Nikhil Siddhartha

నిఖిల్( Nikhil ) కార్తికేయ 2 సినిమాతో బ్లాక్ బస్టర్ విజయం సాధించి తనకంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ ను మరింత పెంచుకున్నాడు.ఆ తర్వాత వచ్చిన 18 పేజెస్ కూడా మంచి విజయం సాదించింది.దీంతో ఇప్పుడు హ్యాట్రిక్ విజయం కోసం మరో డిఫరెంట్ కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు.

నిఖిల్ పాన్ ఇండియా వ్యాప్తంగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ స్పై( Spy ).యాక్షన్ థ్రిల్లర్ గా బీ హెచ్ గ్యారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుండి టీజర్ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.ఈ క్రమంలోనే టీజర్ డేట్ ను లాక్ చేసారు మేకర్స్.మే 15 సాయంత్రం 5.04 గంటలకు విడుదల చేస్తున్నట్లు అఫిషియల్ గా అప్డేట్ ఇచ్చారు.

Nikhil’s Spy Teaser Will Be Launched On This Date And Time , Nikhil Siddhartha
Advertisement
Nikhil’s Spy Teaser Will Be Launched On This Date And Time , Nikhil Siddhartha

అలాగే ఈ అప్డేట్ పాటు ఇండియన్ స్పైస్ కి సంబంధించిన వీడియోను విడుదల చేసారు.ఇది నెట్టింట వైరల్ అయ్యింది.ఇక ఈ సినిమాలో ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది.

అలాగే ఇడి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు.ఆర్యన్ రాజేష్( Aryan Rajesh ) కూడా కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు.

చూడాలి నిఖిల్ హ్యాట్రిక్ హిట్ అందుకుంటాడో లేదో.

వారంలో 2 సార్లు ఈ రెమెడీని ట్రై చేస్తే మెడ న‌లుపు మాయం!
Advertisement

తాజా వార్తలు