నిఖిల్ 'స్పై' కోసం చైతూ.. ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ అండ్ వెన్యూ డీటెయిల్స్!

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోల్లో నిఖిల్ సిద్ధార్థ్ ( Nikhil Siddharth )ఒకరు.ఈ యంగ్ హీరో ఇప్పుడు పాన్ ఇండియా వ్యాప్తంగా ఫేమస్ అయ్యాడు.

కార్తికేయ 2( Karthikeya 2 ) సినిమాతో బ్లాక్ బస్టర్ విజయం అందుకుని సాధారణ హీరోగా ఉన్న నిఖిల్ పాన్ ఇండియా హీరో అయ్యాడు.కార్తికేయ 2 సినిమా తర్వాత వెంటనే మళ్ళీ 18 పేజెస్ సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు.

ఇలా వరుసగా రెండు హిట్స్ అందుకుని యంగ్ హీరోల్లోనే తిరుగులేని సక్సెస్ ట్రాక్ ను మైంటైన్ చేస్తున్నాడు.ప్రస్తుతం నిఖిల్ పాన్ ఇండియా వ్యాప్తంగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ స్పై( Spy ).యాక్షన్ థ్రిల్లర్ గా బీ హెచ్ గ్యారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఐశ్వర్య మీనన్ ( Aishwarya Menon )హీరోయిన్ గా నటిస్తుంది.ఇటీవలే ట్రైలర్ ను రిలీజ్ చేయగా ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి.

ఇక ఈ సినిమా రిలీజ్ కు సమయం దగ్గర పడుతుండడంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను చేయడానికి టైం ఫిక్స్ చేసారు.ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ రోజు అంటే జూన్ 27న సాయంత్రం 6 గంటల 30 నిముషాల నుండి హైదరాబాద్ లోని వెస్టిన్ హోటల్ లో గ్రాండ్ గా జరగనుంది.మరి ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా నాగ చైతన్య ( Naga Chaitanya )వస్తున్నట్టు అఫిషియల్ గా అనౌన్స్ చేసారు.

Advertisement

మరి ఈ రోజు జరగనున్న ఈ ఈవెంట్ లో ఎలాంటి ఇంట్రెస్టింగ్ సన్నివేశాలు చోటుచేసుకుంటాయో వేచి చూడాల్సిందే.ఇక ఇడి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై కే రాజశేఖర్ రెడ్డి ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మించడమే కాకుండా కథ కూడా అందించారు.అలాగే ఈ సినిమా జూన్ 29న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.

మరి నిఖిల్ ఈ సినిమాతో ఎలాంటి హిట్ అందుకుంటాడో వేచి చూడాలి.

Advertisement

తాజా వార్తలు