నాగార్జున వెంకటేష్ బాలయ్య హీరోలని నాకు తెలియదు.. నిహారిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

మెగా డాటర్ నిహారిక( Niharika ) ప్రస్తుతం తన సినిమా పనులలో బిజీగా ఉన్నారు.

ఈమె ఇటీవల కాలంలో కెరియర్ పై పూర్తిగా ఫోకస్ చేశారని తెలుస్తుంది.

తన భర్త నుంచి విడాకులు తీసుకొని విడిపోయిన తర్వాత నిహారిక నిర్మాతగా మారిపోయారు.ఇక ఈమె నటిగా పలు సినిమాలలో నటిస్తూనే మరోవైపు నిర్మాతగా వెబ్ సిరీస్ లో అలాగే సినిమాలు కూడా నిర్మిస్తున్నారు.

ఇక ఈమె నిర్మిస్తున్నటువంటి మొట్టమొదటి చిత్రం కమిటీ కుర్రాళ్ళు( Committee Kurrallu ).ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Niharika Sensational Comments On Balakrishna Venkatesh And Nagarjuna Details, Ni

ఈ క్రమంలోనే ఈ సినిమా నుంచి టీజర్ విడుదల చేశారు.ఈ టీజర్ లాంచ్ కార్యక్రమం అనంతరం నిహారిక మీడియా సమావేశంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా నిహారిక చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement
Niharika Sensational Comments On Balakrishna Venkatesh And Nagarjuna Details, Ni

ఈ సందర్భంగా నిహారిక మాట్లాడుతూ తన చిన్ననాటి విషయాలను గుర్తు చేసుకున్నారు.చిన్నప్పుడు తాను ఫిలిం ఛాంబర్ లో సినిమాలు చూసేదాన్ని.అయితే నేను ఎక్కువగా పెదనాన్న చిరంజీవి( Chiranjeevi ) సినిమాలు మాత్రమే చూసే దానిని.

Niharika Sensational Comments On Balakrishna Venkatesh And Nagarjuna Details, Ni

ఇలా పెదనాన్న సినిమాలు మాత్రమే చూడటంతో పెదనాన్న మాత్రమే హీరో అనుకున్నాను మరేవరు హీరోలు లేరని భావించేదాన్ని అప్పుడు నాకు బాలకృష్ణ,( Balakrishna ) వెంకటేష్,( Venkatesh ) నాగార్జున( Nagarjuna ) వంటి వారందరూ కూడా సినిమాలు చేస్తారని వీరంతా హీరోలు అనే విషయం నాకు అసలు తెలియదు.మరి కొద్ది రోజులకు నేను రామానాయుడు స్టూడియోలో ఫిలిం ఛాంబర్ లో సినిమాలు చూసినప్పుడు ఓహో వీళ్ళు కూడా హీరోలేనా అనుకున్నాను అంటూ అప్పటి విషయాలను సరదాగా గుర్తు చేసుకుంటూ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు