తెలుగు ప్రేక్షకులకు మెగా డాటర్ నిహారిక( Mega Daughter Niharika ) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
మొన్నటి వరకు ఈమె పేరు సోషల్ మీడియాలో మారుమోగిన సంగతి మనందరికీ తెలిసిందే.
అంతేకాకుండా దారుణమైన ట్రోల్స్ నెగిటివ్ కామెంట్స్ తో ఈమెను ఏకీపారేశారు.పెళ్లయిన రెండేళ్లకే విడాకులు తీసుకొని విడిపోవడంతో ఈమెపై దారుణమైన కామెంట్స్ చేస్తూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
నిహారికకు నటనలోనూ అలాగే యాంకరింగ్ రెండింటిలోనూ ప్రావీణ్యం ఉంది అన్న విషయం తెలిసిందే.వీటికి తోడుగా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పేరిట తనకు నిర్మాణ సంస్థ కూడా ఉంది.
ఈ బ్యానర్ ద్వారా కొన్ని సినిమాలు సైతం నిర్మించింది.
మొదట్లో హీరోయిన్‌గా నటించిన నిహారిక తర్వాత చాలా కాలం వరకు అటువైపు వెళ్లలేదు.ఇటీవలే డెడ్ పిక్సెల్స్ అనే సిరీస్‌లో నటించి మరోసారి యాక్టింగ్‌కు సై అని సంకేతాలు ఇచ్చింది.ఇకపోతే కొన్ని నెలలుగా చైతన్య జొన్నలగడ్డ( Chaitanya Jonnalagadda )తో దూరంగా ఉంటున్న ఆమె జూలై 4న విడాకులు తీసుకుంటున్న విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించింది.
అందుకు సంబంధించిన విషయాన్ని చెబుతూ .దయచేసి తమ వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించవద్దని అభ్యర్థించింది.అయినా సరే జనాలు మాత్రం ఆమెను విమర్శిస్తూనే ఉన్నారు.
విడాకులు తీసుకోవడానికి నువ్వే ప్రధాన కారణమంటూ ఆమెను నిందిస్తున్నారు.ఏ పోస్ట్ పెట్టినా తనను విమర్శిస్తూ కామెంట్లు పెడుతున్నారు.
అయినప్పటికీ.ఇవేమీ పట్టించుకోని నిహారిక తాజాగా ఇన్‌స్టాగ్రామ్( Niharika Instagram )లో పలు ఫోటోలను షేర్ చేసింది.ఐస్‌క్రీమ్ తింటూ, నిద్రపోతూ, చేతికి మెహందీ చూపిస్తూ ఇలా పలు రకాల ఫోటోలు షేర్ చేసింది.
చివర్లో ఒక సందేశాన్ని కూడా షేర్ చేసింది.జీవితంలో కొన్ని వలయాలు ఉంటాయి.
ఇవి ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి.అలా జరగకూడదని, అక్కడే ఆగిపోవాలని మనం కోరుకుంటే దాని సహజగుణానికి అడ్డుపడుతున్నట్లే.
దీనివల్ల లేనిపోని అనవసరమైన ఒత్తిడి పెరుగుతుంది.కాబట్టి జీవితం ఎటు తీసుకువెళ్తే అటు వెళ్లండి.
ఈ ప్రయాణం ఎక్కడికి వెళ్తుందో తెలుసుకున్నాక నువ్వే సర్‌ప్రైజ్ అవుతావు అని రాసుకొచ్చింది నిహారిక.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy