ఈ అల్ట్రాస్పీడ్‌ త్రీడీ ప్రింటర్‌ తో మీకు చాలా సమయం ఆదా అవుతుంది.. ధర తక్కువే?

టెక్నాలజీ( Technology ) కొత్త పుంతలు తొక్కుతోంది.దానిని వాడుకొని మనిషి ఎన్నో దశాబ్దాల ముందుకి పోతున్నాడు.

చేత్తో తయారుచేయలేని వస్తువులను టెక్నాలజీ సాయంతో సృష్టించగలిగే స్థాయికి వచ్చేసాం.ఈ క్రమంలో అతి తక్కువ ఖర్చుతో కచ్చితమైన ఫలితాలను మనిషి పొందుతున్నాడు.

పర్యావరణాన్ని పరిరక్షిస్తూ, ఇంధనాన్ని ఆదా చేస్తూ.వస్తు సామగ్రి నుంచి రోబోల వరకు తయారు చేసే సాంకేతిక విప్లవం ఆల్రెడీ మొదలైంది.

ఒకప్పుడు నమూనాల తయారీకే పరిమితమైన టెక్నాలజీ మారుతున్న కాలానుగుణంగా వేగంగా పుంజుకుంటున్న త్రీడీ ముద్రణ( 3D Printing ) వరకు బలపడింది.అవును, ఈ క్రమంలోనే హాంకాంగ్‌కు చెందిన త్రీడీ ప్రింటర్ల తయారీ సంస్థ ఎనీ క్యూబిక్( AnyCubic ) ఓ త్రీడీ ప్రింటర్‌ తయారు చేసింది.ఈ ఫొటోలో కనబడుతున్నది అదే.ఈ అల్ట్రాస్పీడ్‌ త్రీడీ ప్రింటర్‌ మోడల్‌ పేరు ఎనీక్యూబిక్‌ కోబ్రా2.( AnyCubic Kobra 2 ) ఇది మిగిలిన త్రీడీ ప్రింటర్లతో పోల్చుకుంటే 70 శాతం వేగంగా వస్తువులను ముద్రించగలదని సమాచారం.

Advertisement

కాగా దీనిని పది నిమిషాల్లోనే అసెంబుల్‌ చేసుకోవచ్చు.దీనికి ఉన్న 4.5 అంగుళాల టచ్‌ స్క్రీన్‌ ద్వారా ప్రింట్‌ చేయాలనుకున్న వస్తువుల తీరుతెన్నులను మనకినచ్చినట్టు సవరించుకోవచ్చు కూడా.ఇది లెవిక్యూ-2.0 ఆటో లెవెలింగ్‌ టెక్నాలజీ సాయంతో పనిచేస్తుందని కంపెనీ చెబుతోంది.ఈ ప్రింటర్‌ సెకనుకు 250 మిల్లీమీటర్ల వేగంతో వస్తువులను ముద్రించగలడు.

ప్రాజెక్టులు, వర్క్‌షాపుల కోసం అనువుగా ఉండేలా దీనిని రూపొందించడం విశేషం.స్వల్పవ్యవధిలోనే ప్లాన్లు, డిజైన్లు చేయాలనుకునే ఇంజినీర్లకు ఇది బాగా ఉపయోగపడుతుందని అంటున్నారు.కాగా దీని ధర 499 డాలర్లు (రు.41,098) మాత్రమే!.

Advertisement

తాజా వార్తలు