చైనా దేశంలో( China ) తరచుగా కొత్త వైరస్‌లు బయటపడుతున్నాయి.ఇవి యావత్తు ప్రపంచాన్ని వణికిస్తున్నాయి.
తాజాగా ఈ డ్రాగన్ కంట్రీలో వెట్‌లాండ్ వైరస్( WELV ) అనే కొత్త వైరస్ కనిపెట్టడం జరిగింది.ఈ వైరస్ దోమకాటు ద్వారా మనుషులకు వ్యాపిస్తుంది.
ఈ వైరస్ వల్ల పట్టిన వారికి తీవ్ర అనారోగ్యం, ముఖ్యంగా నాడీ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది.అంటే ఈ వైరస్ బ్రెయిన్‌ను( Brain ) టార్గెట్ చేస్తుంది.2019 జూన్‌లో ఇన్నర్ మంగోలియాలోని ఒక తడిభూమి ప్రాంతంలో దోమ కుట్టిన తర్వాత జింజౌ నగరానికి చెందిన 61 ఏళ్ల వ్యక్తికి జ్వరం, తలనొప్పి, వాంతులు వచ్చాయి.ఆయన ద్వారా ఈ వైరస్‌ను గుర్తించారు.
ముందుగా ఈ రోగికి యాంటీబయాటిక్స్ ఇచ్చినా ఫలితం లేకపోయింది.ఎందుకంటే ఇది బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధి కాదు, వైరస్( Virus ) వల్ల వచ్చే వ్యాధి అని తేలింది.
అతని రక్త పరీక్షలో ఇది ఒక కొత్త రకమైన వైరస్ తెలిసింది .దీనికి ఆర్థోనైరోవైరస్( Orthonairovirus ) అని పేరు.క్రిమియన్-కాంగో హెమరాజిక్ ఫీవర్ వంటి వ్యాధులకు కారణమయ్యే వైరస్‌లు కూడా ఈ కుటుంబానికి చెందినవే.
ది నివ్ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ అనే పత్రికలో ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం, చైనాలో ఇప్పటికే 17 మందికి ఈ వెట్‌లాండ్ వైరస్( Wetland Virus ) సోకింది.జ్వరం, తల తిరుగుట, తలనొప్పి, కీళ్ల నొప్పులు, అలసట వంటి లక్షణాలు సాధారణంగా కనిపిస్తున్నాయి.కోమా లాంటి నాడీ వ్యవస్థకు సంబంధించిన లక్షణాలు కూడా కనిపించాయి.
అయితే, వైద్య చికిత్స తీసుకున్న తర్వాత అందరు రోగులు కోలుకున్నారు.కొన్ని సందర్భాల్లో ఈ వైరస్ చాలా ప్రమాదకరం కావచ్చు అని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
చైనా ఉత్తర భాగంలోని దోమలు, జంతువులు, మనుషులలో కూడా WELV వైరస్ కనిపెట్టడం జరిగింది.పరిశోధకులు వివిధ రకాల దోమలను 14,000 కంటే ఎక్కువ సేకరించి పరీక్షించగా, దాదాపు 2 శాతం నమూనాలలో ఈ వైరస్ ఉన్నట్లు తేలింది.ముఖ్యంగా హీమాఫైసాలిస్ కాన్సిన్నా అనే రకం దోమలో ఈ వైరస్ ఎక్కువగా కనిపించింది.
అంతేకాకుండా, ఆ ప్రాంతంలోని గొర్రెలు, గుర్రాలు, పందులు, ఎలుకలు వంటి జంతువులలో కూడా WELV జాడలు కనిపించాయి.WELV ఇప్పుడే కనుగొనబడిన వైరస్ అయినప్పటికీ, ఇది మనుషులకు, జంతువులకు అంటుకునేందుకు సామర్థ్యం కలిగి ఉండటం వల్ల ఆరోగ్యానికి ముప్పుగా ఉంది.
ఈ వైరస్ ఎలా వ్యాపిస్తుంది, దీని ప్రభావం ఎంత ఉంటుందనే దాని గురించి మరింత పరిశోధన జరుగుతోంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy