CM Ramesh : సీఎం రమేష్ కి కొత్త పదవి..!!

ఏపీ బీజేపీ పార్టీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ కి రాజ్యసభ సెక్రటరీయట్ కొత్త పదవి అప్పజెప్పడం జరిగింది.

పూర్తి విషయంలోకి వెళ్తే సీఎం రమేష్ నీ రాజ్యసభ హౌస్ కమిటీ చైర్మన్ గా నియమిస్తూ రాజ్యసభ సెక్రటరీయట్ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.

రాజ్యసభ నుండి ఈ పదవికి సంబంధించి ప్రకటన ఈ నెల రెండవ తారీకు రావడం తెలిసిందే.కాగా తాజాగా రాజ్యసభ సెక్రటరీయట్ ఆ ఉత్తర్వులు జారీ చేసింది.

New Post For CM Ramesh Details BJP, Rajyasabha Member CM Ramesh , Rajya Sabha Se

దీంతో రాజ్యసభ హౌస్ కమిటీ చైర్మన్ హోదాలో ఎంపీలు, ఇతర సభ్యులకు ఢిల్లీలో వసతి సౌకర్యం కల్పించే బాధ్యతలను సీఎం రమేష్ ఇకనుండి పర్యవేక్షించనున్నారు. ఇక ఇదే సమయంలో సభకు కొత్తగా ఎన్నికైన వారికి భవనాలు కేటాయించడంతో పాటు పదవీకాలం పూర్తయిన వారిని ఆయా భవనాల నుండి ఖాళీ చేయించటం జరుగుతుంది.

ఇంకా సభ్యులకు కేటాయించినా సౌకర్యాలను పర్యవేక్షించడం ఈ కమిటీ యొక్క బాధ్యత.

Advertisement
రాజమౌళి సినిమాలో చేయడానికి ఆర్టిస్టులు ఎందుకు ఉత్సాహాన్ని చూపిస్తారు...

తాజా వార్తలు