ఈరోజు నుంచి ట్రాఫిక్ పోలీసు చాలా స్ట్రిక్ట్ గా మారనున్నాడు.
తెలంగాణ రాష్ట్రం మొత్తం ట్రాఫిక్ విధివిధానాలు మారుతున్నాయో లేదో కాని, హైదరబాద్ వరకు మాత్రం కొత్తగా పాయింట్స్ సిస్టం తీసుకొచ్చారు.
ఈరోజు నుంచే ఈ పాయింట్ సిస్టం అమలు.ఇకనుంచి హెల్మెట్ లేకుండా దొరికితే వంద చేతికిచ్చి వెళ్ళడం కుదరదేమో, యూ టర్న్ కోసం అరకిలోమీటరు ఎవడు వెళతాడు అంటూ రాంగ్ రూట్ లో వెళ్ళడం అస్సలు కుదరదేమో.
లైసెన్స్ లేకుండా నగరంలో తిరగడం దాదాపుగా ఆసాధ్యం ఏమో.ఎందుకంటే ఇకనుంచి ప్రజలే ఒళ్ళు దగ్గర పెట్టుకోని వాహానాలు నడుపుతారు.రూల్స్ అతిక్రమిస్తే వారికే నష్టం.
మీరే చూడండి .ఈ పాయింట్స్ ఏంటో.ఆ పాయింట్స్ వలన దొరికే పనిష్మెంట్ ఏంటో.
* హెల్మెట్ లేదా సీట్ బెల్ట్ లేకపోతే = 1 పాయింట్ * అతి వేగం మరియు రాంగ్ రూట్ మీద నడపటం = 2 పాయింట్స్ * ఇన్సురెన్స్ లేకుండా బండి నడపడం = 2 పాయింట్స్ * మద్యం సేవించి నడపడం (ద్విచక్ర) = 3 పాయింట్స్ * మద్యం సేవించి నడపడం (మూడు/నాలుగు చక్రాలు) = 4 పాయింట్స్ * గవర్నమెంటు వాహనాన్ని తాగి నడపడం = 5 పాయింట్స్ * పోలుషన్ సర్టిఫికేట్ లేకపోవడం లేదా హైవే రోడ్డు మీద పార్క్ చేయడం = 2 పాయింట్స్ * గూడ్స్ బండిలో అనుమతి లేని ప్రయాణికులని తీసుకెళ్లడం = 2 పాయింట్స్ * IPC Sections 279, 336, 337, 338 = 2 పాయింట్స్ * IPC sections 304 (I), 304 (II) = 5 పాయింట్స్ * డ్రైవింగ్ చేస్తూ చైన్ దొంగలించడం = 5 పాయింట్స్ కేవలం పాయింట్స్ వేసి వదిలేస్తారు అనుకుంటే అది మీ భ్రమే.పాయింట్స్ జమ చేసుకుంటే ఏమవుతుందో చూడండి.
* మొదటిసారి 12 పాయింట్స్ జమ అయితే ఓ సంవత్సరం పాటు లైసెన్స్ సస్పెండ్ చేసేస్తారు.* రెండోవసారి 12 పాయింట్స్ జమ చేసుకుంటే రెండేళ్ళ పాటు లైసెన్సస్ సస్పెన్షన్ తో పాటు, లర్నర్స్ లైన్సేస్ క్యాన్సల్ చేసి, అదనంగా 5 పాయింట్స్ వేస్తారు.
* మూడోవసారి 12 పాయింట్స్ జమ అయితే ఏకంగా మూడేళ్ళపాటు లైసెన్స్ సస్పెండ్ చేసేస్తారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy