వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్స్‌లో కొత్తగా మెసేజ్ రియాక్షన్స్‌.. వారికి మాత్రమే రిలీజ్!

కమ్యూనిటీ అనౌన్స్‌మెంట్ గ్రూప్‌ల కోసం వాట్సాప్ తన ఆండ్రాయిడ్ బీటా వెర్షన్‌లో "మెసేజ్ రియాక్షన్స్( Message reactions )" అనే కొత్త ఫీచర్‌ను తాజాగా పరిచయం చేస్తోంది.

ఈ ఫీచర్ ద్వారా కమ్యూనిటీలోని సభ్యులు గ్రూప్‌లో షేర్ చేసిన మెసేజ్‌లకు రెస్పాండ్ అవ్వచ్చు.

ఈ అప్‌డేట్ యూజర్ తన పూర్తి ఫోన్ నంబర్‌ను ఇతర సభ్యుల నుంచి దాచే వెసులుబాటు కూడా కల్పిస్తోంది.తద్వారా ప్రైవసీని అందిస్తుంది.

సాధారణంగా కమ్యూనిటీలలో చేరినప్పుడు అందులో తెలియని వారు చాలామంది ఇంటరాక్ట్ అవుతుంటారు.వారికి వాట్సాప్ నంబర్ షేర్ చేయకుండా ఉండడానికి నంబర్ హైడ్ అనే ఫీచర్ కూడా పరిచయం చేయడానికి కృషి చేస్తోంది.

అలాగే ఇప్పుడు రియాక్ట్ అవుతున్న మెసేజ్‌ ద్వారా నంబర్ ఎవరికీ కనిపించకుండా వాట్సాప్ దాచిపెడుతోంది.

Advertisement

సాధారణంగా వాట్సాప్ కమ్యూనిటీలలో( WhatsApp ) 1024 కంటే ఎక్కువ మంది పాల్గొంటారు కాబట్టి చాలా రిస్ట్రిక్షన్స్ ఇక్కడ అమలు చేస్తున్నారు.ఏ యూజర్ ప్రైవసీకి భంగం కలగకుండా వాట్సాప్ చర్యలు తీసుకుంటుంది.ఇకపోతే కొత్త మెసేజ్ రియాక్షన్స్ ఫీచర్ ఆండ్రాయిడ్ వాట్సాప్ బీటా 2.23.15.13 వెర్షన్ ఇన్‌స్టాల్ చేసుకున్న వారికి మాత్రమే రిలీజ్ అవుతోంది.స్టేబుల్ వెర్షన్ యూజర్లకు ఈ ఫీచర్ మరి కొద్ది రోజుల్లో రిలీజ్ అయ్యే అవకాశం ఉందని వాట్సాప్ బీటా ఇన్ఫో లేటెస్ట్ రిపోర్టు వెల్లడించింది.

ఈ ఫీచర్‌లో ఏవైనా లోపాలు ఉన్నాయా లేదా అనేది నిర్ధారించడానికి చిన్న కమ్యూనిటీలలో మాత్రమే లక్షణాన్ని టెస్ట్ చేయాల్సిందిగా వాట్సాప్ బీటా ఇన్ఫో యూజర్లను కోరింది.కమ్యూనిటీ అడ్మిన్‌లు ( Community admission ) అభిప్రాయాన్ని సేకరించేందుకు, ఇతర సభ్యులు తమ అభిప్రాయాలను తెలియజేయడానికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది.ఈ ఫీచర్ 2.23.15.13 వెర్షన్ ఇన్‌స్టాల్ చేసుకున్న వారిలో కొంతమంది బీటా టెస్టర్లకు అందుబాటులో ఉంది.ఇక వాట్సాప్ తెలియని నంబర్స్‌ సేవ్ చేయకుండానే వాటితో చాట్ ప్రారంభించగల మరొక ఫీచర్ కూడా తీసుకొస్తుంది.

ప్రస్తుతం స్టేబుల్ వెర్షన్ వాడుతున్న వారికి కూడా ఇది రిలీజ్ అవుతుంది.

ఆరోగ్యంగా లేమని చెప్పటానికి సూచనలు..
Advertisement

తాజా వార్తలు