జీ20లో కొత్త సభ్యత్వం.. ఆఫ్రికన్ యూనియన్‎కు మోదీ స్వాగతం

జీ20లో కొత్త సభ్యత్వం నమోదు అయింది.ఈ మేరకు ఆఫ్రికన్ యూనియన్ భాగస్వామిగా జీ -20 సభ్యత్వం ఇచ్చింది.

భారత్ మద్ధతుతో ఏయూ సభ్యత్వానికి ఆమోదం లభించింది.ఈ క్రమంలోనే జీ20 దేశాల కూటమిలోకి ఆఫ్రికన్ యూనియన్ ను శాశ్వత సభ్య దేశంగా చేర్చుతున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు.50 దేశాలతో కూడిన ఆఫ్రికన్ యూనియన్ ను శాశ్వత మెంబర్ గా చేర్చే ప్రతిపాదనను మోదీ సదస్సులో ప్రకటించారు.దీన్ని సభ్య దేశాలు అన్ని స్వాగతించాయి.

అనంతరం ప్రధాని మోదీ ట్విట్టర్ వేదికగా ఆఫ్రికన్ యూనియన్ కు స్వాగతం పలికారు.జీ 20 కుటుంబంలోకి శాశ్వత సభ్యురాలిగా ఆఫ్రికన్ యూనియన్ ను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.

ఇది జీ 20ని మరింత బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు.అలాగే అంతర్జాతీయంగా దక్షిణాది స్వరం బలపడుతుందని ట్వీట్ చేశారు.

Advertisement
కూతురు కోసం కొరియా వెళ్లిన ఇండియన్ ఫాదర్.. వీడియో చూస్తే ఫిదా..

తాజా వార్తలు