భారత క్రికెట్ జట్టులోనూ, చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోనూ ధోని వెన్నంటే ఉన్నాడు సురేష్ రైనా.
ధోని అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన వెంటనే తాను కూడా అదే బాటలో నడిచాడు.
ఇంకో మూడు నాలుగేళ్లు అంతర్జాతీయ క్రికెట్ ఆడే సత్తా ఉన్నప్పటికీ రిటైర్మెంట్ ప్రకటించి, అందరినీ ఆశ్చర్యపరిచాడు.ఇక తాజా ఐపీఎల్ వేలంలో అన్ని ఫ్రాంచైజీలు అతడికి షాక్ ఇచ్చాయి.
ఏ జట్టూ అతడిని తీసుకోకపోవడంతో అతడు ఐపీఎల్‌కు దూరమవుతాడని అంతా భావించారు.అయితే కామెంటేటర్‌గా కొత్త అవతారమెత్తాడు రైనా.
ఇక చెన్నై సూపర్‌కింగ్స్ జట్టు కెప్టెన్సీని వదులుకుంటున్నట్లు ధోనీ ప్రకటించిన విషయంపై అతడు స్పందించాడు.అతడి స్థానంలో పగ్గాలు చేపట్టే వారెవరో తెలిపాడు.
*సీఎస్కేలో ఎందరో ప్రతిభావంతులు* 2008లో ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి చెన్నైకి చెందిన ఫ్రాంచైజీకి ధోనీ నాయకత్వం వహిస్తున్నాడు.అంతర్జాతీయ క్రికెట్ జట్టుకు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ ధోనిని కెప్టెన్సీగా సీఎస్‌కే కొనసాగించింది.
ఇక ధోని మునిపటిలా బ్యాటింగ్ చేయలేకపోతుడడంతో అతడు ఐపీఎల్ నుంచి తప్పుకోనున్నాడు.తాజాగా అతడి స్థానంలో చెన్నై జట్టును ఐపీఎల్‌లో నడిపించే వారు ఎవరనే ప్రశ్నలు ప్రస్తుతం అందరూ లేవనెత్తుతున్నారు.
అయితే ఆ జట్టు మాజీ క్రీడాకారుడు రైనా నలుగురిని ప్రత్యామ్నాయంగా చూపుతున్నాడు.రవీంద్ర జడేజా, రాబిన్ ఊతప్ప, అంబటి రాయుడు, డ్వేన్ బ్రేవో చెన్నై జట్టుకు కెప్టెన్సీ పగ్గాలు చేపట్టగల సామర్ధ్యం ఉందని రైనా అభిప్రాయపడ్డాడు.
*రైనా ఉండుంటే.* ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో సురేష్ రైనా ఉండుంటే నిస్సందేహంగా అతడే కెప్టెన్ అయి ఉండేవాడని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.రూ.2 కోట్ల బేస్ ప్రైస్‌తో బరిలోకి దిగిన రైనాను కొనుగోలు చేసేందుకు ఏ జట్లు ఆసక్తి చూపకపోవడంతో మెగా వేలంలో అమ్ముడుపోలేదు.అయితే కామెంటేటర్‌గా కొత్త రూపంలో రైనా అలరించనున్నాడు.
మార్చి 26 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్-2022లో రవిశాస్త్రితో కలిసి హిందీ భాషలో కామెంటేటర్‌గా రైనా అలరించనున్నాడు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy