Niharika Konidela : నిహారికపై దారుణంగా ట్రోల్స్.. బెడ్ పై ఒకరు మైండ్ లో ఒకరంటూ?

మెగా డాటర్ కొణిదెల నిహారిక గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.నిహారిక ప్రస్తుతం మ్యారేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే.

ఇది ఇలా ఉంటే చాలా గ్యాప్ తర్వాత నిహారిక( Niharika Konidela ) మళ్లీ యాక్టింగ్ వైపు దృష్టి పెట్టింది.ఈ నేపథ్యంలోనే ఆమె డెడ్ పిక్సెల్స్( Dead Pixels ) అనే ఒక వెబ్ సిరీస్ లో నటిస్తోంది.

ఆదిత్య మండల దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ మే 19వ తేదీ నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్( Disney Plus Hotstar ) లో స్ట్రీమింగ్ కానుంది.తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మూవీ మేకర్స్.

అయితే ఆ వెబ్ సిరీస్ లో నిహారిక చెప్పిన డైలాగుల పై ప్రస్తుతం తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

Netizens Trolling Niharika Over Dead Pixels Dialogue
Advertisement
Netizens Trolling Niharika Over Dead Pixels Dialogue-Niharika Konidela : ని

అందులో ఒక గేమర్ గా కనిపించిన నిహారిక ఒక వ్యక్తిని ప్రేమిస్తూ ఉంటుంది.అలా ఆన్ లైన్ లో ఒకరిని ఆఫ్ లైన్ లో ఒకరిని ఇష్టపడుతూ ఉంటుంది.ఇద్దరిలో ఎవరిని భాగస్వామిగా సెలక్ట్‌ చేసుకోవాలో అర్థం కాదు.

ఆ సమయంలో నాకు బెడ్‌పై రోషన్‌ కావాలి.కానీ మైండ్‌లో భార్గవ్‌ ఉన్నాడు(రోషన్‌ ఇన్‌ బెడ్‌.

భార్గవ్‌ ఇన్‌ ద హెడ్‌) అని డైలాగ్‌ చెప్తుంది.అయితే ఇది చాలామందికి నచ్చలేదు.

ఇలాంటి డైలాగులు అవసరమా? సమాజానికి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు అంటూ నిహారికను ఏకిపాడేస్తున్నారు.ఇకపోతే గత కొద్ది రోజులుగా సోషల్ మీడియా( Social media )లో నిహారిక విడాకులకు సంబంధించి వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.

Netizens Trolling Niharika Over Dead Pixels Dialogue
నరేష్ 1980లోనే సీరియల్స్ లో నటించాడనే విషయం మీకు తెలుసా?

నిహారిక, ఆమె భర్త చైతన్య ఇద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌( Instagram )లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడంతో వీరి విడాకుల రూమర్స్ మొదలయ్యాయి.అంతేకాకుండా పెళ్లి ఫోటోలను కూడా డిలీట్‌ చేయడంతో ఆ వార్తలకు మరింత ఆజ్యం చేకూర్చినట్టు అయ్యింది.దీంతో వీరు విడాకులు తీసుకోబోతున్నారంటూ ప్రచారం ఊపందుకుంది.

Advertisement

అయితే ఈ వార్తలపై ఇటు నిహారిక ఫ్యామిలీ కానీ అటు చైతన్య ఫ్యామిలీ కానీ స్పందించడం లేదు.

తాజా వార్తలు