విజయ్ దేవరకొండకు అన్యాయం చేస్తున్నావా రష్మిక... లిప్ లాక్ సీన్ పై నెటిజన్స్ కామెంట్!

నేషనల్ క్రష్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి నటి రష్మిక మందన్న ( Rashmika Mandanna ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

పాన్ ఇండియా స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి రష్మిక ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.

ఇక ఈమె బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్( Ranbir kapoor ) తో కలిసి యానిమల్ ( Animal ) సినిమాలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే.ఈ సినిమా నుంచి తాజాగా ఒక పోస్టర్ విడుదల చేయగా ఇందులో రణబీర్ అలాగే రష్మిక ఇద్దరు కూడా ఫ్లైట్ లో డీప్ లిప్ లాక్ ( Lip Lock ) లో మునిగిపోయి ఉన్నారు.

ఇక ఈ పోస్టర్ ను రష్మిక సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.

ఈ విధంగా రష్మిక ( Rashmika Mandanna )ఈ పోస్టర్ ను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఎంతోమంది ఈ పోస్టర్ పై భారీ స్థాయిలో ట్రోల్స్ చేస్తున్నారు.ఈ విధంగా రణబీర్ కపూర్ కు లిప్ లాక్ చేస్తూ విజయ్ దేవరకొండకు అన్యాయం చేస్తావా రష్మిక ఇది చాలా ద్రోహం అంటూ కొందరు కామెంట్లు చేయగా వెంటనే ఈ పోస్ట్ డిలీట్ చెయ్యి అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.ఇలాంటి వాటికి విజయ్ దేవరకొండ దూరంగా ఉంటున్నారు మీరు కూడా అలాగే దూరంగా ఉండండి అంటూ మరికొందరు ఈ పోస్టర్ పై భారీ స్థాయిలో ట్రోల్స్ చేస్తున్నారు.

Advertisement

రష్మిక పోస్టర్ పై ఇలా కామెంట్స్ రావడానికి కారణం లేకపోలేదు.ఈమె నటుడు విజయ్ దేవరకొండతో( Vijay Devarakonda, ) కలిసి రెండు సినిమాలలో నటించారు.అయితే ఈ సినిమాల సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారని వీరి ప్రేమ విషయాన్ని చాలా రహస్యంగా దాచుతూ వస్తున్నారు అంటూ కామెంట్ చేస్తున్నారు.

అయితే ఇప్పటికే వీరి రిలేషన్ గురించి సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు వచ్చినప్పటికీ వీరిద్దరూ మాత్రం తాము బెస్ట్ ఫ్రెండ్స్ అని చెబుతున్నారు కానీ ఇద్దరు కలిసి కలిసి వెళ్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారని అయితే ఆ విషయాన్ని బయట పెట్టడం లేదు అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు.ఈ క్రమంలోనే ఈమె రణబీర్ కపూర్ కు లిప్ లాక్ ఇవ్వడంతో ఈ పోస్టర్ పై ట్రోల్స్ మొదలయ్యాయని చెప్పాలి.

Advertisement

తాజా వార్తలు