Anasuya: ఆ కేసు ఏమైంది అనసూయ... యాంకరమ్మను మళ్లీ గెలికిన నెటిజన్స్!

బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అనసూయ ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాలకు దూరమై వరుస సినిమా అవకాశాలతో ఎంతో బిజీగా ఉన్నారు.

ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్న అనసూయ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటారు.

ఇకపోతే సోషల్ మీడియా ద్వారా అనసూయ చేసే కొన్ని పోస్టుల వల్ల పెద్ద ఎత్తున వివాదాలను ఎదుర్కొంటూ ఉంటారు.ఈ క్రమంలోనే గతంలో ఆంటీ అనే వివాదం ఎంతటి పరిణామాలకు దారితీసిందో మనకు తెలిసిందే.

ఏకంగా ఈ విషయంపై అనసూయ పోలీసులను ఆశ్రయించి కేసు కూడా పెట్టారు.అయితే ఈ విషయం అందరూ మర్చిపోయినప్పటికీ తాజాగా ఈమె అభిమానులతో ముచ్చటించారు.

ఈ క్రమంలోనే ఓ నెటిజన్ ఈమెను ప్రశ్నిస్తూ ఆ కేసు ఏమైంది అనసూయ గారు అంటూ ప్రశ్నించారు.ఈ ప్రశ్నకు అనసూయ మరోసారి తనదైన స్టైల్ లో సమాధానం చెప్పారు.

Advertisement

అరెస్టులు మొదలయ్యాయి కదా ఇది కొందరి ఫ్యూచర్ కి సంబంధించిన విషయం కనుక విచారణ జరిపిన అనంతరమే అరెస్టు చేస్తున్నారు.మెల్లిగా ప్రాసెస్ జరుగుతుంది.మన సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ వారిని చూస్తే ఎంతో గర్వంగా ఉంటుంది.

ఇలా చేసేవారికి నేను చొప్పదల్చుకున్నది ఒక్కటే.ఎదుటివారిని కించపరచడం అగౌరవపరచడం చాలా తప్పు ఇది చట్టరీత్యా నేరం ఇన్ని రోజులు ఓపిక పట్టాను.

ఇకపై యాక్షన్ తీసుకోవడమే అంటూ మరోసారి అనసూయ తనదైన స్టైల్ లో సమాధానం చెప్పారు.ప్రస్తుతం అనసూయ చేసినటువంటి ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.

Shuffle : Analyse De L’expérience Mobile Et Des Paiements...
Advertisement