Siri Srihan : సిరిని లేపుకెళ్లిపోతానన్న నెటిజన్… శ్రీహాన్ రియాక్షన్ ఏంటో తెలుసా?

సోషల్ మీడియా ద్వారా ఎంతో మంది సెలెబ్రెటీలుగా మారిన సంగతి మనకు తెలిసిందే.

ఇలా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎన్నో రకాల వీడియోస్ వెబ్ సిరీస్ లను చేస్తూ అనంతరం బుల్లితెర అవకాశాలు అందుకున్నటువంటి వారిలో యూట్యూబర్ సిరి హనుమంత్( Siri Hanumanth ) , శ్రీహాన్ జంట ఒకటి అని చెప్పాలి.

ఇలా యూట్యూబ్ వీడియోలు వెబ్ సిరీస్ ల ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు.ఇకపోతే వీరికి ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ దృష్టిలో పెట్టుకొని సిరి బిగ్ బాస్ సీజన్ ఫైవ్( Bigg Boss 5) కార్యక్రమానికి కంటెస్టెంట్ గా వెళ్లారు.

Netizen Funny Comments On Bigg Boss Siri Hanumanth

ఇక ఈ కార్యక్రమంలో ఈమె మరొక యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ ( Shanmukh Jaswanth ) తో కలిసి చేసినటువంటి రొమాన్స్ ఏ స్థాయిలో నెగిటివీటిని తీసుకువచ్చిందో మనకు తెలిసిందే.ఇలా వీరిద్దరూ హౌస్ లో చాలా చనువుగా ఉండడంతో వీరి గురించి నెగిటివిటీ రావడంతో చివరికి తన ప్రియుడితో బ్రేకప్ చెప్పుకునే పరిస్థితి వరకు వెళ్లిందంటూ ఓ సందర్భంలో సిరి వెల్లడించారు.ఇలా వీరి మధ్య ఎన్నో గొడవలు జరిగినప్పటికీ వాటన్నింటిని మర్చిపోయి తిరిగి ఒకటయ్యారు.

ఇక ఈ జంట పెళ్లి కాకుండానే ఒక బిడ్డను దత్తత తీసుకొని వారి బాగోగులు చూసుకోవడమే కాకుండా ఆ చిన్నారికి తల్లిదండ్రులుగా మారిపోయారు.ఇక ఈ మధ్యకాలంలో సిరి శ్రీహాన్( Srihan ) ఇద్దరూ కూడా పలు బుల్లి తెర తెర కార్యక్రమాలలో పెద్ద ఎత్తున సందడి చేస్తూ విపరీతమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు.

Advertisement
Netizen Funny Comments On Bigg Boss Siri Hanumanth-Siri Srihan : సిరి�

ఇక వీరిద్దరికీ ఏమాత్రం విరామ సమయం దొరికిన సోషల్ మీడియా వేదికగా అభిమానులతో సరదాగా ముచ్చటిస్తూ వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ ఉంటారు.

Netizen Funny Comments On Bigg Boss Siri Hanumanth

ఈ క్రమంలోనే సిరి ఆస్క్ మీ క్వశ్చన్( Ask Me Question ) అంటూ సోషల్ మీడియా వేదికగా ఇవే అభిమానులతో ముచ్చటిస్తూ వచ్చారు.ఈ క్రమంలోనే ఒక నెటిజన్ ఈమెను ప్రశ్నిస్తూ మీరు కనుక శ్రీహన్ను లవ్ చేయకపోయి ఉంటే నేనే మిమ్మల్ని లేపకెళ్ళిపోయేవాడిని అంటూ ఈమెను ప్రశ్నించారు దీంతో ఒక్కసారిగా సిరి షాక్ అవ్వడమే కాకుండా శ్రీహాన్ వద్దకు వచ్చి కన్నా ఇటువైపు చూడు శ్రీహానిని లవ్ చేయకపోతే లేపకెళ్ళి పోయే వాడిని అంటూ కామెంట్ చేశారని సిరి శ్రీహాన్ కి చెప్పగా ఒక్కసారిగా షాక్ అయినటువంటి శ్రీహాన్ ఎవరది అంటూ తిరిగి ప్రశ్నించారు.అయితే ఈ ప్రశ్నకు సిరి ఎవరో తెలియదు అంటూ సమాధానం చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించినటి విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

పబ్లిసిటీ కంటే అదే ముఖ్యమని చెప్పిన యామీ గౌతమ్.. అలా మాత్రం చేయొద్దంటూ?
Advertisement

తాజా వార్తలు