కస్టమర్లకోసం భారీ మార్పులు చేస్తున్న నెట్‌ఫ్లిక్స్‌.. త్వరలో అమలుకానున్నాయి!

OTT ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ అంటే తెలియని యువత ఉండదు.ప్రపంచవ్యాప్తంగా అత్యధిక సబ్‌స్క్రైబర్ల పరంగా నెట్‌ఫ్లిక్స్ మిగతా OTTల కంటే ముందున్న సంగతి అందరికీ తెలిసిందే.

అలాంటి నెట్‌ఫ్లిక్స్ కొంతకాలంగా గడ్డు పరిస్థితిని చవిచూస్తోంది.దాదాపు కొన్ని సంవత్సరాలుగా ఆదాయాన్ని కోల్పోతూ వస్తోంది.

ఈ క్రమంలో యూజర్ల సంఖ్య కూడా తగ్గుతోంది.అందువలన నెట్‌ఫ్లిక్స్ మరలా తన యూజర్లను వలపట్టే దిశగా ఆలోచనలు చేస్తోంది.

తాజాగా బిజినెస్ మోడల్‌ను మార్చేందుకు 2 కీలక నిర్ణయాలు తీసుకుంది.అయితే వీటిని ఈ సంవత్సరమే అమలులోకి తీసుకురానున్నట్టు తాజాగా పేర్కొంది.

Advertisement

ఇక ఆ 2 బిజినెస్ మోడల్‌ను గురించి ఇపుడు తెలుసుకుందాం.అడ్వర్టైజ్‌మెంట్లతో కూడిన చౌకైన ప్లాన్‌ ఒకటైతే, ఇతరులతో పాస్‌వర్డ్ షేర్ చేసుకుంటే అదనంగా చార్జ్ చేయడమే రెండవది.

అయితే 2022 ముగిసేలోగానే వీటిని నెట్‌ఫ్లిక్స్ ఆచరణలోకి తీసుకురానుందని తెలుస్తోంది.కాగా తాజాగా న్యూయార్క్ టైమ్స్ ఈ విషయాలను బయటకు వెల్లడించింది.

ప్రస్తుతం ఉన్న ప్లాన్‌లు కాకుండా అడ్వర్టైజ్‌మెంట్‌లతో కూడిన ప్లాన్‌లను వచ్చే ఏడాది లేదా 2024లో తీసుకొచ్చే ఆలోచన ఉందని నెట్‌ఫ్లిక్స్ CEO రీడ్ హాస్టింగ్స్ నెలక్రితం చెప్పారు.అయితే ఈ ఏడాదే నెట్‌ఫ్లిక్స్.

యాడ్ బేస్డ్ ప్లాన్‌లను తీసుకొస్తుందని తాజాగా చెప్పడం గమనార్హం.

ఆగకుండా ఎక్కిళ్లు వస్తున్నాయా? కరోనా కొత్త లక్షణమే!

ఈ ప్లాన్స్ ఈ సంవత్సరంలో ఎప్పుడు రాబోతున్నాయంటే, అక్టోబర్ - డిసెంబర్ నెల మధ్యలోనే ఇలాంటి ప్లాన్స్ రానున్నాయని ఇంటర్నల్ నోట్ ద్వారా తేలింది.ఎలాంటి డబ్బు ఖర్చు చేయకుండా దాదాపు 10కోట్ల మంది నెట్‌ఫ్లిక్స్ సేవలు పొందుతున్నారని వెల్లడించింది.ఈ క్రమంలో ఆ సంస్థ పొందిన నష్టాలకు గల కారణాలను వివరించింది.

Advertisement

సో కాల్డ్ కస్టమర్స్ ఫ్రెండ్స్, బంధువుల వద్ద లాగిన్ కోసం అవసరమైన పాస్‌వర్డ్‌లు తీసుకొని ఇలా ఉచితంగా వాడుతున్నారని, అందువలన భారీగా ఆదాయం కోల్పోతున్నామని పేర్కొంది.అందుకే ఇతరులతో పాస్‌వర్డ్ షేర్ చేసుకోవాలనుకునే వారికి అదనపు చార్జీలతో ప్లాన్‌లను తీసుకురావాలని నెట్‌ఫ్లిక్స్ నిర్ణయించుకుంది.