నేను స్టూడెంట్ సర్ సినిమా కలక్షన్స్ అంతేనా..?

బెల్లంకొండ సురేష్( Bellamkonda Suresh ) చిన్న కొడుకు అయిన సాయి గణేష్( Sai Ganesh ) హీరోగా వచ్చిన మొదటి సినిమా స్వాతిముత్యం.

ఈ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చి పాస్ మార్కులు వేయించుకున్నాడు బెల్లంకొండ గణేష్.

అతను హీరోగా రూపొందిన రెండో సినిమా ‘నేను స్టూడెంట్ సర్’( Nenu student sir ).రాకేష్‌ ఉప్పలపాటి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం.ఎస్వీ 2 ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్ పై ‘నాంది’ సతీష్ వర్మ నిర్మించారు.

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ భాగ్యశ్రీ కూతురు అవంతిక దస్సాని( Avantika Dassani ) ఈ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.

యాక్షన్ థ్రిల్లర్‌ గా రూపొందిన ఈ సినిమా టీజర్‌, ట్రైలర్ ఓకే అనిపించాయి.జూన్ 2న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.మొదటి రోజు ఈ చిత్రానికి నెగిటివ్ టాక్ వచ్చింది.

Advertisement

దీంతో ఓపెనింగ్స్ చాలా డల్ గా ఉన్నాయి.ఒకసారి ఫస్ట్ డే కలెక్షన్స్ ను గనక మనం గమనిస్తే .

నైజాం 0.06 cr సీడెడ్ 0.02 cr ఆంధ్ర 0.05 cr ఏపీ+ తెలంగాణ టోటల్ 0.13 cr రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 0.02 cr వరల్డ్ వైడ్ టోటల్ 0.15 cr ‘నేను స్టూడెంట్ సర్’ చిత్రం బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.1.9 కోట్లు.మొదటి రోజు ఈ సినిమా కేవలం రూ.0.15 కోట్లు షేర్ ను కలెక్ట్ చేసింది.బ్రేక్ ఈవెన్ కు రూ.1.75 కోట్లు షేర్ ను రాబట్టాల్సి ఉండగా ఇక శని, ఆదివారాల్లో కూడా ఈ సినిమా మీద ఆడియన్స్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు దాంతో ఈ సినిమా శని, ఆదివారాలు కలిపి కేవలం 20 లక్షల వసూళ్లను మాత్రమే రాబట్టింది.ఈ కలక్షన్స్ ని చూస్తుంటే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మారనుందని తెలుస్తుంది.

Advertisement

తాజా వార్తలు