MP Vemireddy Prabhakar Reddy : ఎంపి వేమిరెడ్డి అసంప్తృప్తిని పట్టించుకోని వైసీపీ

వైసిపి రాజ్యసభ సభ్యుడు, నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి( Vemireddy Prabhakar Reddy ) గత కొద్దిరోజులుగా సైలెంట్ అయిపోయారు.

ఇటీవల చేపట్టిన ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల మార్పు, చేర్పుల వ్యవహారంలో తన మాటకు జగన్( CM Jagan ) ప్రాధాన్యం ఇవ్వలేదనే అసంతృప్తితో ప్రభాకర్ రెడ్డి ఉన్నారు.

దివంగత నేత వైస్ రాజశేఖర్ రెడ్డి తోనూ సన్నిహితంగా మెలిగిన ప్రభాకర్ రెడ్డి ఆ తరువాత జగన్ వైసీపీని స్థాపించిన దగ్గర నుంచి పార్టీలో కీలక నేతగా ఉంటూ వస్తున్నారు.ఆయనకు రాజ్యసభ సభ్యుడుగా జగన్ అవకాశం ఇచ్చారు.

అయితే గత కొద్ది రోజులుగా పార్టీ కార్యక్రమాలకు ప్రభాకర్ రెడ్డి దూరంగా ఉంటున్నారు .తన ముఖ్య అనుచరులను దూరంగా ఉండాలని సూచించారట.దీంతోపాటు ,పార్టీ జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేసే ఆలోచనతో ప్రభాకర్ రెడ్డి ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది,

ఇటీవల ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో నెల్లూరు ఎంపీ( Nellore MP ) అభ్యర్థిగా ప్రభాకర్ రెడ్డిని జగన్ ప్రకటించారు.అయితే ఆ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ముగ్గురు ఎమ్మెల్యేలను మార్చడం పై ప్రభాకర్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారట.నెల్లూరులో తన భార్య వేమిరెడ్డి ప్రశాంతికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని జగన్ కోరినా పట్టించుకోకపోవడం, మదీనా వాచ్ కంపెనీ అధినేతకైనా ఆ టికెట్ ఇవ్వాలని కోరినా పట్టించుకోకుండా ఆ స్థానంలో సిట్టింగ్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్( Anil Kumar Yadav ) అనుచరుడు ఖలీల్ ను ఇన్చార్జిగా నియమించడం పై ప్రభాకర్ రెడ్డి అలిగినట్లుగా ప్రచారం జరుగుతుంది.

Advertisement

తాజాగా ఈ వ్యవహారంపై వైసీపీ కీలక నేత మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు.ఎన్నికల సమయంలో అసంతృప్తులు, అలకలు సహజమేనని, ఖచ్ఛిష్టంగా గెలుస్తారు అనుకున్న వారికే టికెట్లు జగన్ ఇస్తున్నారని పెద్దిరెడ్డి అన్నారు.

ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సరైన పనితీరు కనపరచని వారికి పార్టీ టికెట్ నిరాకరించిందని వారు అసంతృప్తితో ఉండడం సర్వసాధారణమేనని పెద్దిరెడ్డి పేర్కొన్నారు.పెద్దిరెడ్డి చెబితే జగన్ చెప్పినట్లే కావడంతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అసంతృప్తిని వైసిపి పట్టించుకోనట్టుగానే అర్థమవుతుంది.దీంతో కీలకమైన నెల్లూరు జిల్లా వైసీపీ లో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గాని మారింది.

వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీ జిల్లా అధ్యక్ష పదవికి , పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తే ప్రత్యామ్నాయంగా నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా ఎవరిని ప్రకటిస్తారనే దానిపై చర్చ జరుగుతోంది.అయితే ప్రభాకర్ రెడ్డిని బుజ్జగించేందుకు కీలక నేతలని రంగంలోకి దించే ఆలోచనలో జగన్ ఉన్నట్లు సమాచారం.

స్కిన్ వైటెనింగ్ కోసం ఆరాట‌ప‌డుతున్నారా? అయితే ఈ ఆయిల్ మీకోస‌మే!
Advertisement

తాజా వార్తలు