చైల్డ్ లేబర్ రూపు మాపగలమా?

మన ప్రభుత్వాలు చాలా పనులు చేయలేక పోయాయి.రాబోయే కాలంలో కూడా ఆ పనులు పూర్తి అవుతాయని చెప్పలేం.

అలాంటి వాటిల్లో చైల్డ్ లేబర్ ఒకటి.దీన్నే బాల కార్మిక వ్యవస్థ అంటున్నాము.

చిన్న పిల్లలు బడులలో ఉండాలి పనుల్లో కాదు అని ప్రభుత్వాలు నినాదాలు ఇస్తున్నాయి.కాని అనేక మంది పనుల్లో ఉండటం చూస్తున్నాం.

పిల్లలు కార్మికులుగా మారడానికి అనేక సామాజిక, ఆర్ధిక కారణాలు ఉన్నాయి.పేదరికం, చదువు లేకపోవడం ప్రధాన కారణాలు.

Advertisement

బాల కార్మిక వ్యవస్థను రూపు మాపడానికి చట్టాలు ఉన్నా అవి చట్టు బండలు అవుతున్నాయి గాని అమలు జరగడం లేదు.మంచి తెలివి తేటలు ఉన్నవారు, బాగా చదువుకోవలసిన వారు పరిశ్రమల్లో మగ్గి పోతున్నారు.

బాల కార్మిక వ్యవస్థను రూపు మాపడానికి కృషి చేస్తున్న సంస్థలను ప్రభుత్వం పట్టించుకోవడంలేదు.దీనిపైనే ఆవేదన వ్యక్తం చేసారు బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి చేస్తున్న నోబుల్ బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్ది.

ఎవరైనా పిల్లల చేత పనులు చేయిస్తే వారిపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టాలని అన్నారు.సత్యార్ది చెప్పింది కరెక్ట్.

కాని మన ప్రభుత్వాలు ఆ పని చేస్తాయని అనుకోలేము.అనేకమంది అధికారుల, నాయకుల ఇళ్లలోనే బాల కార్మికులు ఉన్నారు.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
వైరల్ వీడియో : టీ20 వరల్డ్ కప్ జట్టును ప్రకటించిన చిన్నారులు..

వారిని ఎవరూ ప్రశ్నించడం లేదు.వీరే ఇలా ఉంటే సాధారణ జనం భిన్నంగా ఉంటారా?.

Advertisement

తాజా వార్తలు