మెడ కండరాలు పెట్టేస్తే....ఈ వ్యాయామాలు చేయండి

తరచుగా మెడ కండరాలు పట్టేయటం,చిన్నపాటి కదలికకే నొప్పి రావటం వంటి సమస్యలకు ముఖ్య కారణం మెడకు సరైన వ్యాయామం లేకపోవటమే.

అందుకే రోజుకి ఒకసారి ఇలా చేస్తే సాధారణంగా ఎదురయ్యే మెడ నొప్పి, ఒత్తిడి కారణంగా వచ్చే మెడ నొప్పి నుండి దూరం కావచ్చు.

నిటారుగా కూర్చొని మెడను రిలాక్స్ గా కిందకు వంచాలి.ఈ దశలో గడ్డం ఛాతికి తగులుతూ ఉంటుంది.

ఈ దశ నుంచి మెడను ముందుగా కుడి వైపుకి వంచి వెనక్కు అదే డైరెక్షన్ లో ముందుకు రావాలి.ఈ విధంగా ఆరు సార్లు చేయాలి.

కుర్చీలో నిటారుగా కూర్చొని మెడను కుడి వైపుకు వంచాలి.ఈ దశలో కుడి చెవి భుజాన్ని తాకుతుంది.

Advertisement

మెల్లగా పైకి లేపి ఎడమ వైపుకు వంచాలి.ఈ విధంగా 6 సార్లు చేయాలి.

అలాగే వ్యతిరేక దిశలోను చేయాలి.మెడను (తలను) వలయాకారంగా తిప్పాలి.

ముందు నుంచి ఎడమ,వెనక ,కుడి నుంచి మళ్ళీ ముందుకు రావాలి.ఇలా ఒకసారి క్లాక్ వైజ్ గాను, మరోసారి యాంటీ క్లాక్ వైజ్ గాను చేస్తే ఒక రౌండ్ అయినట్టు.

ఈ విధంగా నాలుగు రౌండ్ లు చేయాలి.

ముఖంపై అవాంఛిత రోమాలను క్ష‌ణాల్లో తొల‌గించే సూప‌ర్ మాస్క్ ఇదే!
Advertisement

తాజా వార్తలు