సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ - ఇండియా కూటమి హోరాహోరీ

సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ - ఇండియా కూటమి( NDA - India alliance ) మధ్య పోరు హోరాహోరీగా సాగుతోంది.

ఈ మేరకు పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటీ తీవ్రస్థాయిలో ఉంది.

వారణాసిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ( Prime Minister Narendra Modi ) సుమారు లక్షన్నరకు పైగా ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు.గాంధీనగర్ లో ఏడు లక్షల ఓట్లకు పైగా లీడ్ లో అమిత్ షా ఉన్నారు.

ఇక రాయబరేలి, వాయనాడ్ లో మూడు లక్షలకు పైగా ఓట్లతో రాహుల్ గాంధీ( Rahul Gandhi ) ఆధిక్యతను కనబరుస్తున్నారు.మరోవైపు మహారాష్ట్రలో ఎన్డీఏ డీలా పడిందని తెలుస్తోంది.

ఈ క్రమంలోనే మొత్తం 48 స్థానాల్లో 29 చోట్ల ఇండియా కూటమి లీడ్ లో ఉంది.గుజరాత్ లో మొత్తం 26 స్థానాలుండగా.25 స్థానాల్లో బీజేపీ, ఒక స్థానంలో కాంగ్రెస్ లీడ్ లో ఉన్నాయి.అదేవిధంగా కర్ణాటకలో మొత్తం 28 స్థానాలు ఉండగా.19 చోట్ల ఎన్డీఏ, తొమ్మిది చోట్ల కాంగ్రెస్ ఆధిక్యంలో ఉన్నాయి.ఇక తమిళనాడులో వార్ వన్ సైడ్ అన్న తరహాలో డీఎంకే ఆధిక్యంలో దూసుకెళ్తుంది.

Advertisement
కాఫీ, టీ తాగే ముందు మంచినీళ్లు తాగితే మంచిదా..కాదా?

తాజా వార్తలు