తన సమకాలిక హీరోయిన్లు అందరూ రేసులో వెనకబడిపోతుంటే.నయనతార మాత్రం యమ స్పీడుగా దూసుకుపోతూనే ఉంది.
కధల ఎంపికలో ఆమె తీసుకునే "జాగ్రత్తలు, రిస్కులు" అందుకు కారణాలు.కథ నచ్చితే గర్భవతిగా, పిల్లల తల్లిగా, లేదా చెవిటిదానిగా నటించడానికి సైతం ఆమె ఎంతమాత్రం సంకోచించదు.
ఓ బిడ్డకు తల్లిగా నయనతార నటించిన హారర్ ఎంటర్ టైనర్ "మయూరి" ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే.ఇప్పుడు ఈ చిత్రం కోవలో నయనతారతో మరో చిత్రం రూపొందుతోంది.
తెలుగు-తమిళ్ భాషల్లో ఏక కాలంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని తెలుగులో.సాయిమణికంఠ క్రియేషన్స్ అధినేత జూలకంటి మధుసూదన్ రెడ్డి సమర్పణలో.
మానస్ రుషి ఎంటర్ ప్రైజస్ పతాకంపై కె.రోహిత్ నిర్మిస్తున్నారు.ఈ చిత్రానికి సజ్జూ భాయ్-రామ్ ప్రసాద్ వి.వి.ఎన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్.లేడి ఓరియంటెడ్ హారర్ డ్రామా ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి "దాస్ రామస్వామి" దర్సకత్వం వహిస్తున్నారు.
నిర్మాత కె.రోహిత్-సమర్పకులు జూలకంటి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ."భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఇంకా పేరు పెట్టని ఈ చిత్రాన్ని తెలుగులో అందించబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది.
త్వరలోనే ఈ చిత్రం టైటిల్ మరియు మిగతా వివరాలు ప్రకటించనున్నాం" అన్నారు.
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy