Nayanthara: నాలుగు పదుల వయస్సులో కూడా ఇంత అందమా.. నయనతారకు ఎవ్వరూ సాటిరారంటూ?

కోలీవుడ్ స్టార్ హీరోయిన్,లేడీ సూపర్ స్టార్ నయనతార( Nayanthara ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

నయనతార ప్రస్తుతం కోలీవుడ్ లో వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

ఒకప్పుడు తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది.ఈమె కోలీవుడ్ స్టార్ దర్శకుడు విగ్నేష్ శివన్ ని( Vignesh Shivan ) ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే.

పెళ్లి అయినప్పటికీ అదే ఊపుతో సినిమాలలో నటిస్తూ దూసుకుపోతుంది ఈ ముద్దుగుమ్మ.కేవలం హీరోయిన్ గా సినిమాలలో నటించడం మాత్రమే కాకుండా నిర్మాతగా మారి పలు సినిమాలను నిర్మిస్తోంది.

ప్రస్తుతం ఇద్దరు కవల పిల్లలకు తల్లి అయినా కూడా ఏమాత్రం తగ్గకుండా అదే ఊపుతో దూసుకుపోతోంది నయనతార.అంతేకాకుండా నాలుగుపదుల వయసులో కూడా ఇప్పటికీ అదే అందాన్ని మెయింటైన్ చేస్తూ యంగ్ హీరోయిన్ లకు గట్టి పోటీని ఇస్తోంది.కాగా నేడు నయనతార 40వ పుట్టినరోజు.

Advertisement

39 సంవత్సరాలను పూర్తి చేసుకొని నేడు తన 40 ఏటా అడుగుపెట్టింది.ఈ సందర్భంగా తాజాగా ఆమె తన పుట్టినరోజు వేడుకలను( Nayanthara Birthday ) జరుపుకుంది.

నాలుగు పదుల వయసులో కూడా ఇప్పటికీ చెక్కుచెదరని అందంతో యువతని ఆకట్టుకుంటోంది.

ఇకపోతే నయనతార విషయానికి వస్తే.మొదట 2003 లో వచ్చిన మనస్సినక్కరే అనే మలయాళ సినిమాతో సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నయనతార ఆ సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది.తర్వాత సూపర్ స్టార్ రజనీ కాంత్ తో కలిసి చేసిన చంద్రముఖి చిత్రం( Chandramukhi ) నయనతార గురించి అన్ని బాషల ప్రజలకి తెలిసేలా చేసింది.

ఈ మూవీ తర్వాత ఈమెకు అవకాశాలు వరుసగా క్యూ కట్టాయి.అలా ఇప్పటికీ ఆమె సినిమా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చి 20 ఏళ్ళు పూర్తి అవుతోంది.తెలుగు తమిళం, హిందీ బాషల్లో ఎన్నో సినిమాలలో నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ.

jamuna, Relangi : రేలంగి మాటలకు హీరోయిన్ జమున జంప్..కారణం ఏంటి ?
Advertisement

తాజా వార్తలు