విఘ్నేష్ ను ఎంతలా లవ్ చేస్తున్నానో చెప్పడానికి మాటలు సరిపోవు.. నయన్ కామెంట్స్ వైరల్!

సీనియర్ స్టార్ హీరోయిన్ నయనతార (Nayanatara)వయస్సు పెరుగుతున్నా గ్లామరస్ గానే కనిపిస్తూ తన లుక్స్ తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నారు.

విఘ్నేష్ శివన్ (vignesh shivan)పుట్టినరోజు సందర్భంగా నయనతార కొన్ని స్పెషల్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకోవడంతో పాటు భర్తను ముద్దు పెట్టుకుంటూ ఫోటోలలో కనిపించారు.

తన పోస్ట్ లో నయన్ చేసిన కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.హ్యాపీ బర్త్ డే మై ఎవ్రీథింగ్.

నేను నిన్ను ఎంతలా లవ్ చేస్తున్నానో చెప్పడానికి మాటలు సరిపోవు.నువ్వు కన్న కలలు నిజం కావాలని దేవుడు నిన్ను దీవించాలని కోరుకుంటున్నా అంటూ నయన్ తన పోస్ట్ లో పేర్కొన్నారు.

నయనతార(Nayanatara) షేర్ చేసిన ఫోటోలు, పోస్ట్ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.భర్తపై నయన్ చూపించిన ప్రేమకు నెటిజన్లు సైతం ఫిదా అవుతున్నారు.

Nayanatara Comments About Vignesh Shivan Details Inside Goes Viral In Social Me
Advertisement
Nayanatara Comments About Vignesh Shivan Details Inside Goes Viral In Social Me

నేనూ రౌడీనే సినిమా కోసం నయన్, విఘ్నేష్ శివన్(Nayan, Vignesh Sivan) తొలిసారి పని చేయగా ఆ సినిమా సమయంలోనే నయన్ విఘ్నేష్ మధ్య ప్రేమ పుట్టింది.ఏడేళ్ల పాటు ప్రేమలో ఉన్న నయన్ విఘ్నేష్ తర్వాత రోజుల్లో పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.సరోగసి విధానంలో నయనతార తల్లయ్యారు.

విఘ్నేష్ శివన్ విషయానికి వస్తే ప్రస్తుతం లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ (Love Insurance Company)అనే మూవీతో బిజీగా ఉన్నారు.

Nayanatara Comments About Vignesh Shivan Details Inside Goes Viral In Social Me

ఈ సినిమా సక్సెస్ సాధిస్తే విఘ్నేష్ శివన్ రేంజ్ పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి.ఈ మధ్య కాలంలో విఘ్నేష్ శివన్ కు సరైన సక్సెస్ లేకపోవడం కెరీర్ పరంగా మైనస్ అవుతోంది.విఘ్నేష్ శివన్ కెరీర్ పరంగా భారీ విజయాలను ఖాతాలో వేసుకోవాలని అభిమానులు మనస్పూర్తిగా కోరుకుంటున్నారు.

విఘ్నేష్ శివన్ పారితోషికం పరిమితంగానే ఉందని తెలుస్తోంది.విఘ్నేష్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

వారంలో 2 సార్లు ఈ రెమెడీని ట్రై చేస్తే మెడ న‌లుపు మాయం!
Advertisement

తాజా వార్తలు