నయన్, విగ్నేష్: ఒకరికి ఒకరు ఎన్ని కోట్ల విలువ చేసే బహుమతులు ఇచ్చుకున్నారో తెలుసా ?

గత ఏడు సంవత్సరాలుగా ప్రేమలో మునిగి తేలుతున్న నయనతార విగ్నేష్ ఇద్దరు ఇటీవలే ఏడడుగుల బంధంతో ఒకటయ్యారు.

వీరిద్దరూ తమ ప్రేమబంధాన్ని మూడు ముళ్ళతో పెనవేసుకుని జూన్ 9వ తేదీన మహాబలిపురం లో ఒక ప్రైవేటు రిసార్ట్ లో పెళ్లి చేసుకొని అభిమానులను కనువిందు చేశారు.

వీరి పెళ్లికి టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా వందల మంది అతిథులు, సెలబ్రిటీలు హాజరై వీనులవిందు చేశారు.బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్, రజనీకాంత్ లాంటి వాళ్ళు అనేక మంది ఈ పెళ్ళికి విచ్చేశారు.

అంతేకాదు ఈ సెలబ్రిటీలు అంతా కూడా నయనతార విగ్నేష్ లకి అనేక విలువైన బహుమతులు కూడా కానుకగా ఇచ్చారు.వీరి వివాహం జరిగిన తీరు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

వీరి వివాహానికి వచ్చిన అతిధులు, వారు ఇచ్చిన కానుకలు అలాగే పెళ్లికి జరిగిన ఖర్చు, నయనతార ధరించిన చీర ఇలా ప్రతి ఒక్కటి కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇక అసలు విషయానికి వస్తే వీరికి అతిథులు ఇచ్చిన కానుకలు కాకుండా నయనతార అలాగే విగ్నేష్ లు ఒకరికి ఒకరు ఎంతో అద్వితీయమైన బహుమతులు ఇచ్చుకున్నట్టుగా తెలుస్తోంది.

Advertisement
Nayan And Vignesh Costly Gifts To Each Other Details, Nayanthara, Director Vigne

నయన్ విగ్నేష్ లు వీరి పెళ్లికి గుర్తుగా కోట్లు ఖర్చు పెట్టి ఒకరి కోసం ఒకరు కానుకలు ఇచ్చుకున్నారట.

Nayan And Vignesh Costly Gifts To Each Other Details, Nayanthara, Director Vigne

అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది నయనతార గురించి ఆమె తన ప్రియమైన భర్త కోసం ఏకంగా పాతిక కోట్లు ఖర్చు పెట్టి చెన్నైలోని అత్యంత విలాసవంతమైన ఏరియాలో ఇంద్రభవనం లాంటి ఒక ఇంటిని కొనుగోలు చేసి బహుమతిగా ఇచ్చిందట.అంతేకాదు విగ్నేష్ సోదరి కోసం నయన్ ఏకంగా ఏడు వారాల నగలు కానుకగా ఇచ్చిన వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి.ఇక విగ్నేష్ తరఫున బంధువులకు కూడా అనేక విలువైన కానుకలు నయనతార ఇవ్వడం ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.

Nayan And Vignesh Costly Gifts To Each Other Details, Nayanthara, Director Vigne

ఇక నేను ఏదైనా తక్కువ తిన్నానా అంటూ విగ్నేష్ సైతం తన భార్య కోసం ఏకంగా మూడు కోట్ల విలువ చేసే బంగారు నగలని బహూకరించాడు అంతే కాదు ఐదు కోట్ల విలువ చేసే ఉంగరాన్ని నయనతారకి కానుకగా ఇచ్చారట.ఇదంతా కాకుండా పెళ్లిలో నయనతార మేడలో విగ్నేష్ కట్టిన తాళి సూపర్ స్టార్ రజినీకాంత్ బహుకరించారు.ఇక వీరి పెళ్లికి రాష్ట్రమంతా కూడా అన్నదానాలు నిర్వహించడం కోసం మెరుపు.

దాదాపు లక్షమందికి పైగా నయనతార వివాహ విందును ఆస్వాదించటం గమనార్హం.

మోకాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు ఉన్నవాళ్లు దీన్ని తింటే ఏమవుతుందో తెలుసా..?
Advertisement

తాజా వార్తలు