Nawazuddin Siddiqui: రొమాన్స్ కు వయస్సుతో సంబంధమేంటి.. ఈ నటుడి కామెంట్లు వింటే షాకవ్వాల్సిందే!

తెలుగు సినీ ప్రేక్షకులకు బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్‌ సిద్ధిఖీ గురించి ప్రత్యేకంగా అక్కర్లేదు.

నవాజుద్దీన్‌ సిద్ధిఖీ( Nawazuddin Siddiqu ) బాలీవుడ్ ప్రేక్షకులతో పాటు టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.

ఇది ఇలా ఉంటే నవాజుద్దీన్‌ సిద్ధిఖీ అవనీత్‌ కౌర్‌ జంటగా నటించిన చిత్రం టిక్కు వెడ్స్ షేరు( Tiku Weds Sheru ).ఈ సినిమాకు సాయి కబీర్‌ దర్శకత్వం వహించారు.ఈ మూవీని కంగనా రనౌత్‌ నిర్మించారు.

ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్‌ విడుదల చేశారు మూవీ మేకర్స్.అయితే ట్రైలర్‌లో హీరోయిన్‌ను నవాజుద్దీన్‌ కిస్ చేయడం పై ప్రస్తుతం సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

Nawazuddin Young Generation Useless After Liplock Avneet Kaur

ఈ విషయంపై చాలామంది స్పందిస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు.50 ఏళ్ల నటుడితో 21 ఏళ్ల అమ్మాయికి రొమాంటిక్ సీన్స్ ఏంటని కొందరు ట్రోల్స్ చేశారు.తాజాగా ఆ సీన్‌పై వస్తున్న విమర్శలకు నవాజుద్దీన్ తనదైన శైలిలో సమాధానమిచ్చారు.

Advertisement
Nawazuddin Young Generation Useless After Liplock Avneet Kaur-Nawazuddin Siddiq

ఇటీవల మూవీ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నవాజుద్దీన్‌ విమర్శలపై స్పందింస్తూ.హీరో, హీరోయిన్ లకు ఏజ్ గ్యాప్ అనేది పెద్ద సమస్య కాదు.

రొమాన్స్‌కు వయసుతో సంబంధం లేదు.ముఖ్యంగా ఇప్పుడున్న బాలీవుడ్ బాద్‌షా షారుక్‌ ఖాన్ (Shah Rukh Khan )ఇప్పటికీ రొమాంటిక్‌ రోల్స్‌ చేస్తున్నాడు.

ఎందుకంటే ఇప్పుడున్న యంగ్‌ హీరోలు పనికిరాని వారు కాబట్టే.వారికేదో రొమాన్సే తెలియదన్నట్టు మాట్లాడుతున్నారు.

Nawazuddin Young Generation Useless After Liplock Avneet Kaur

ఇప్పుడు లవ్‌, బ్రేకప్‌ అన్నీ వాట్సాప్‌ లోనే జరుగుతున్నాయి.దీని వెనుక ఒక కారణం ఉంది.జీవితంలో రొమాన్స్‌ ఎవరైతే చేస్తారో వాళ్లు మాత్రమే ఇలాంటి సీన్స్ చేయగలరు అంటూ కాస్తా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు నవాజుద్దీన్‌ సిద్ధిఖీ.

శ‌రీరంలో హిమోగ్లోబిన్ లెవ‌ల్స్ ను పెంచే పండ్లు ఇవే..!
రామ్ చరణ్ సక్సెస్ ఫుల్ లైనప్ ను సెట్ చేసుకున్నాడా..?

ఇకపోతే నవాజ్ తాజాగా నటించిన మూవీ టికు వెడ్స్ షేరు మూవీ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో ఈ నెల 23న విడుదల కానుంది.నవాజుద్దీన్ ప్రస్తుతం వెంకటేశ్‌ హీరోగా శైలేష్‌ కొలను తెరకెక్కిస్తున్న సైంధవ్‌లో విలన్‌గా నటిస్తున్నారు.

Advertisement

యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రంలో వికాస్‌ మాలిక్‌గా కనిపించనున్నారు.

తాజా వార్తలు