మే 24 నుంచీ ఇర్వింగ్ లో నాట్స్ సంబరాలు..!!!

అమెరికాలో ప్రతీ రెండేళ్ళ కోసారి నాట్స్ (నార్త్ అమెరికా తెలుగు సొసైటీ ) ఆధ్వర్యంలో నిర్వహించే అమెరికా తెలుగు సంబరాలకు అమెరికాలో ఉన్న ప్రతీ తెలుగు వారు తప్పకుండా హాజరవుతారు.

అయితే ఈసారి ఈ సంబరాలకి ఇర్వింగ్ సిద్దమవుతోంది.

ఇర్వింగ్ లోని కన్వెన్షన్‌ సెంటర్‌లో మే 24, 25, 26 తేదీల్లో జరిగే ఈ సంబరాలకి ఎంతో మంది ప్రముఖులు రానున్నట్టు సంస్థ ప్రతినిధులు తెలిపారు.అమెరికాలో ఉన్న అన్ని తెలుగు సంస్థలలో నాట్స్ కి ప్రత్యేకమైన స్థానం ఉంది.

ఎన్నో విశేష సేవలందిస్తూ ఎంతో గుర్తింపు తెచ్చుకుంది.అన్నీ ప్రాంతాల్లో నాట్స్‌ చాప్టర్‌ ద్వారా సేవా కార్యక్రమాలని నిర్వహిస్తున్నామని ఈ వేడుకులకి ఎంతో మంది అతిరథ మహారథులు, సంగీత దర్శకులు కీరవాణితోపాటు పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు కూడా వస్తున్నారని తెలిపారు.

అయితే ఈ సంబరాలకి ఫండ్ రైజింగ్ కార్యక్రమాలని కూడా విజయవంతంగా చేపదుతున్నామని చెప్పారు.ఈ క్రమంలో టెక్సాస్‌లో పార్క్‌ ప్లాజా టవర్స్ లో నిర్వహించిన ఫండ్‌ రైజింగ్‌ కార్యక్రమానికి విశేష స్పందన వచ్చిందని తెలిపారు.సుమారు 6 లక్షల డాలర్లను విరాళాలుగా ఇస్తామని ఈ కార్యక్రమాని విచ్చేసిన వారు ప్రకటించారని సంస్థ ప్రతినిధులు తెలిపారు.

Advertisement
Advertisement