మంత్రి హరీశ్ రావుతో నర్సాపూర్ ఎమ్మెల్యే భేటీ..!

తెలంగాణలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే అభ్యర్థుల జాబితాను ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో టికెట్ లభించక అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేతలను పార్టీ బుజ్జగించే పనిలో పడింది.

మెదక్ జిల్లాలోని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి సీటుపై కేసీఆర్ ఎటువంటి ప్రకటన చేయలేదు.అయితే కేసీఆర్ సొంత జిల్లాలో ఆత్మీయుడుగా ఉన్న ఎమ్మెల్యే మదన్ రెడ్డి సీటు వ్యవహారం పెండింగ్ లో పెట్టడంతో అసంతృప్తి రాగం మొదలైందని తెలుస్తోంది.

మరోవైపు మదన్ రెడ్డిని కాదని మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డికి టికెట్ ఇస్తారనే ఊహాగానాలు జోరందుకున్నాయి.దీంతో మదన్ రెడ్డి తన అనుచరులతో కలిసి మంత్రి హరీశ్ రావు నివాసానికి చేరుకున్నారు.

మంత్రి హరీశ్ రావుతో చర్చించి టికెట్ తనకే కేటాయించాలని మదన్ రెడ్డి కోరనున్నారని తెలుస్తోంది.ఈ నేపథ్యంలో పార్టీ అధిష్టానం మదన్ రెడ్డికే టికెట్ కేటాయిస్తుందా.? లేదా .? అన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Advertisement
గోడలో వింత శబ్దాలు.. గోడను పగలకొట్టి చూస్తే? (వీడియో)

తాజా వార్తలు