నెల్లూరు యువగళం సభలో నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు..!!

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్( Nara Lokesh ) ఎన్నికల సమరభేరిలో భాగంగా నెల్లూరులో యువగళం( Yuvagalam ) నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో లోకేష్ మాట్లాడుతూ వాలంటీర్ వ్యవస్థను( Volunteer System ) కొనసాగిస్తామని తెలియజేశారు.

వాలంటీర్ల గౌరవ వేతనాన్ని పదివేల రూపాయలకు పెంచుతామని పేర్కొన్నారు.అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి గడపకు చేర్చాలన్నదే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.

అదేవిధంగా సర్పంచ్ లు.కౌన్సిలర్స్ తో వాలంటీర్లను అనుసంధానం చేసి.ఇతర సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందించేలా ఏర్పాట్లు చేయడం జరుగుతుందన్నారు.

పీజీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అమలు చేస్తామని స్పష్టం చేయడం జరిగింది.వైసీపీ వాలంటీర్ల ద్వారా ప్రచారం చేయించుకోవడంతో.

Advertisement
Nara Lokesh Sensational Comments In Nellore Yuvagalam Sabha Details, TDP, Lokes

ఎలక్షన్ కమిషన్ వారిని దూరం పెట్టింది.అందుకే పెన్షన్ నేరుగా ఇంటికి అందజేయలేకపోతున్నారు.

Nara Lokesh Sensational Comments In Nellore Yuvagalam Sabha Details, Tdp, Lokes

ఈ క్రమంలో గ్రామ మరియు వార్డు సచివాలయాలలో ఉన్న సిబ్బంది ద్వారా ప్రతి ఒక్కరికి పెన్షన్( Pension ) వాళ్ళ ఇంటిదగ్గర అందజేయాలని ఎలక్షన్ కమిషన్ నీ తాను కోరినట్లు లోకేష్ తెలిపారు.వాళ్లు నియమించిన చీఫ్ సెక్రటరీ ఉండటంతో పెన్షన్ ఇవ్వలేకపోతున్నారు.అంటూ వ్యాఖ్యానించారు.

నెల రోజులు ఓపిక పట్టండి మన ప్రభుత్వం వస్తుంది.వృద్ధులకు నేరుగా పెన్షన్ అందించే బాధ్యత తాను తీసుకుంటానని లోకేష్ స్పష్టం చేశారు.

చంద్రబాబు( Chandrababu ) పాలనలో హైదరాబాద్ ఎంతో అభివృద్ధి జరిగింది.ఆయన అధికారంలోకి వస్తే కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి రాష్ట్రానికి వస్తాయి.

గతంలో తాము అధికారంలో ఉన్న సమయంలో 35 లక్షల మందికి ఉపాధి కలిగేలా ఒప్పందాలు చేసుకోవడం జరిగింది.ఇప్పుడు అధికారంలోకి వచ్చిన వెంటనే మళ్లీ వాటిని కొనసాగేలా చర్యలు తీసుకుని యువతకు ఉపాధి కల్పిస్తామని లోకేష్ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు