"మనం చేద్దాం జ‌గ‌నాసుర ద‌హ‌నం" కార్యక్రమంలో పాల్గొన్న నారా లోకేష్, బ్రాహ్మణి..!!

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు( Chandrababu Naidu ) అక్రమ అరెస్టుకు నిరసనగా టీడీపీ రకరకాల వినూత్న నిరసన కార్యక్రమాలు చేపడుతున్న సంగతి తెలిసిందే.

స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్టు అయిన నాటి నుండి అనేక నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు.

మోత మోగిద్దాం, కాంతితో క్రాంతి, న్యాయానికి సంకెళ్లు.వంటి పేరులతో నిరసన కార్యక్రమాలు చేపట్టారు.

ఇదిలావంటే ప్రజెంట్ దసరా పండుగ నేపథ్యంలో చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా "మనం చేద్దాం జ‌గ‌నాసుర ద‌హ‌నం" అనే కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చింది.ఈ సందర్భంగా రాజమండ్రిలో క్యాంపు సైట్ వద్ద "మనం చేద్దాం జ‌గ‌నాసుర ద‌హ‌నం" కార్యక్రమంలో నారా లోకేష్,( Nara Lokesh ) నారా బ్రాహ్మణి( Nara Brahmani ) పాల్గొన్నారు.

"సైకో పోవాలి" అని రాసి ఉన్న పోస్టర్లను మంటల్లో దహనం చేశారు.రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.

Advertisement

దీనికి సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి.ఇదే సమయంలో ఎన్టీఆర్ భవన్ వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఏపీలో ఇంకా పలు జిల్లాలలో టీడీపీ నాయకులు ఈ "మనం చేద్దాం జ‌గ‌నాసుర ద‌హ‌నం" కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా నిర్వహించడం జరిగింది.

Advertisement