టీజర్ తోనే మెప్పించిన నాని.. ఇక సినిమా వస్తే ఫ్యాన్స్ కు పూనకాలే!

న్యాచురల్ స్టార్ నాని ఇప్పటి వరకు క్లాస్ హీరోగా పిలిపించుకుంటూ వస్తున్నాడు.అయితే ఇప్పుడు చేస్తున్న సినిమాతో ఆ అవకాశం ఇకపై ఉండదు అనే చెప్పాలి.

ఎందుకంటూ ఇప్పటి వరకు ఫ్యామిలీ ఆడియెన్స్ ను మాత్రమే టార్గెట్ చేసిన నాని ఇకపై మాత్రం మాస్ ఆడియెన్స్ ను టార్గెట్ చేయబోతున్నాడు.తన నెక్స్ట్ సినిమా సాలిడ్ మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది.

ప్రెజెంట్ నాని శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో దసరా సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాలో నానికి జోడిగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది.

ఈ సినిమా రా అండ్ విలేజ్ డ్రామా చిత్రంగా తెరకెక్కుతుంది.ఇప్పటికే నాని ఊర మాస్ ఇంటెన్స్ లుక్ కు సంబంధించిన పలు పోస్టర్ లను రిలీజ్ చేసారు మేకర్స్.

Advertisement

ఇవన్నీ ఫ్యాన్స్ లో మంచి వైరల్ గా నిలిచాయి.

ఇక తాజాగా ఈ సినిమా నుండి టీజర్ రిలీజ్ చేసారు.ప్రత్యేక ఈవెంట్ ఏర్పాటు చేసి మరీ ఈ టీజర్ రిలీజ్ చేయగా ఇది నాని ఫ్యాన్స్ ను మాత్రమే కాదు మాస్ ఆడియెన్స్ ను సైతం మెప్పించింది.నానిని మునుపెన్నడూ చూడని విధంగా చూసి ఫ్యాన్స్ ఎగ్జైట్ అవుతున్నారు.

అలాగే నానికి ఇన్నేళ్ల తర్వాత మంచి పాత్ర దక్కింది అనుకుంటున్నారు.ఈ సినిమా నానిని మరో స్థాయికి తీసుకు వెళ్లడం ఖాయం అంటున్నారు.

మరి ఈ సినిమాతో నాని ఎలాంటి హిట్ అందుకుంటాడో వేచి చూడాలి.ఇక ఈ సినిమా మార్చి 30, 2023 లో భారీ స్థాయిలో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో రిలీజ్ చేయనున్నారు.ఇక ఈ సినిమాను శ్రీ లక్ష్మి వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తుండగా.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జూన్ 5, ఆదివారం, జ్యేష్ఠ మాసం , 2022

సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు