నాని తన పాత జోనర్ కి మళ్లీ వెళ్తున్నాడా ? ఆ ఒక్కటి మిస్ అవుతుందా ?

చాలామంది నాచురల్ స్టార్ నాని( Natural Star Nani ) సినిమా చూస్తున్నారు అంటే కడుపుబ్బ నవ్వుకునేవారు ఒకప్పుడు.

ఆయన సినిమాలన్నీ కూడా కామెడి( Comedy ) ప్రాధాన్యతతో కూడుకున్నవే.

పైగా నాని కోర్ స్ట్రెంత్ కూడా మంచి కామెడి నే.మంచి టైమింగ్ తో కూడిన కామెడి సెన్స్ ఉంటుంది నానికి.ఆయన సినిమాలన్నీ కూడా అలాగే ఉండేవి.

అయితే ఎందుకో గాని తనను తాను ఒక మాస్ హీరోగా యాక్షన్ ఎలిమెంట్స్ తో ఉన్న సినిమాలు తీయాలని నిర్ణయించుకున్నాడో ఏమో దసరా సినిమాతో( Dasara Movie ) అలా ఒక్కసారిగా ఎవరు ఊహించని విధంగా మంచి మాస్ లుక్ ఇచ్చి విజయాన్ని సొంత చేసుకున్నాడు.ఇక ఈ సినిమా తర్వాత వచ్చిన హాయ్ నాన్న సినిమాలో కూడా ఎన్నో ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి కానీ కామెడీ పూర్తిగా మిస్ అయింది.

Nani And Sujith Are Working On Comedy Movie Details, Nani, Natural Star Nani, Na

ఇప్పుడు వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని నటిస్తున్న సరిపోదా శనివారం( Saripodhaa Sanivaaram ) అనే సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది అయితే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ కూడా ఇటీవలే విడుదలైంది.గత రెండు సినిమాలు లో మిస్ అయిన కామెడీ ఈ సినిమాలోనైనా ఉంటుంది అని నాని ఫ్యాన్స్ అంతా ఎదురు చూసిన కూడా ఈ టీజర్ కూడా కామెడీ విషయంలో నిరాశ పరిచింది అని చెప్పుకోవచ్చు.దాంతో నాని కూడా ఇక ఈ యాక్షన్, ఎమోషన్స్ అన్నీ కాసేపు పక్కన పెట్టి తన కోర్ స్ట్రెంత్ అయినా కామెడి పై ఫోకస్ చేయాలనుకుంటున్నాడో ఏమో తన తదుపరి సినిమాలో ఖచ్చితంగా కామెడీ ఉండేలా చూసుకుంటున్నాడు.

Nani And Sujith Are Working On Comedy Movie Details, Nani, Natural Star Nani, Na
Advertisement
Nani And Sujith Are Working On Comedy Movie Details, Nani, Natural Star Nani, Na

సరిపోదా శనివారం సినిమా తర్వాత సుజిత్( Director Sujith ) దర్శకత్వంలో నాని ఒక సినిమాకి కమిట్ అయ్యాడు.సుజిత్ కూడా ఇప్పటివరకు సాహో అనే యాక్షన్ సినిమా చేశాడు.దీని తర్వాత పవన్ కళ్యాణ్ తో ఓజి సినిమా చేస్తున్నాడు.

ఇది కూడా పూర్తి స్థాయిలో యాక్షన్ సినిమా గానే తెరకెక్కుతుంది.దాంతో ఈ యాక్షన్ చూసి చూసి బోర్ కొట్టిందో ఏమో సుజిత్ కూడా మంచి కామెడీ సెన్స్ ఉన్న సినిమా తీయాలని అనుకుంటున్నాడు.

దాంతో నాని మరియు సుజిత్ ఇద్దరు వీరి కాంబినేషన్లో వచ్చే సినిమాలో కామెడికి ఎక్కువగా స్పేస్ ఇస్తున్నారట.ఇక ఖచ్చితంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ అందుకుంటుంది అని నాని ఫ్యాన్స్ అంతా అనుకుంటున్నారు.

న్యూస్ రౌండప్ టాప్ 20
Advertisement

తాజా వార్తలు