నాని 'దసరా' విషయంలో వారికి ఇంకా క్లారిటీ రావడం లేదా?

నాని, కీర్తి సురేష్ జంటగా రూపొందిన దసరా సినిమా( Dasara ) మార్చి 30వ తారీకున ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీగా ఉంది.

అద్భుతమైన ఈ సినిమా కోసం తాము ప్రాణం పెట్టి నటించాం అంటూ నాని పలు ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.

అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా ఈ సినిమా ఉంటుందని కూడా యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.కానీ సినిమా టీజర్ మరియు పోస్టర్స్ ను చూస్తూ ఉంటే సినిమా కచ్చితంగా క్లాస్ ఆడియన్స్ ను అలరించే అవకాశం లేదేమో అనిపిస్తుంది.

అందుకు కారణం నాని ( Nani ) యొక్క లుక్ మరియు నాని యొక్క మాస్ డైలాగ్స్ అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున ఈ విషయమై చర్చ జరుగుతోంది.నాని మరియు కీర్తి సురేష్ ల యొక్క లుక్ చూస్తే ఏ ఒక్కరు కూడా వారు క్లాస్ గా ఉన్నారు అనుకునే పరిస్థితి లేదు.మాస్ ఆడియన్స్ కాకుండా క్లాస్ ఆడియన్స్ కనుక దసరా సినిమాను ఇష్టపడితే కచ్చితంగా అద్బుతమే అనే అభిప్రాయంను కొందరు వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

సోషల్‌ మీడియాలో ప్రధానంగా ఈ సినిమా గురించి జరుగుతున్న ప్రచారం నాని దసరా సినిమా మరో కేజీఎఫ్ ( KGF ) అంటున్నారు.అంటే ఈ సినిమా క్లాస్ వారిని కూడా ఆకట్టుకునే అవకాశం ఉంది.

దీన్ని బట్టి చూస్తూ ఉంటే కచ్చితంగా నాని దసరా సినిమా ఒక అద్భుతం అన్నట్లుగా సాగుతుందని అంటున్నారు.అకట్టుకునే అందంతో పాటు ప్రతి ఒక్కరి మతి పోగొట్టేంత క్యూట్‌ గా ఉండే కీర్తి సురేష్ ను ఈ సినిమా లో పూర్తిగా డీ గ్లామర్ గా చూపించారు.అంతే కాకుండా నానిని కూడా చాలా విభిన్నంగా చూపించారు.

నాచురల్‌ స్టార్ కాస్త బొగ్గు స్టార్ అయ్యాడు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.మొత్తానికి దసరా సినిమా నాని మరియు కీర్తి సురేష్ యొక్క అభిమానులను అయినా మెప్పిస్తుందా అంటూ కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

మొత్తానికి ఈ విషయాలపై క్లారిటీ రావాలంటే మాత్రం సినిమా విడుదల వరకు వెయిట్‌ చేయాల్సిందే.

వలసదారులపై డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం .. భారతీయులకు మేలు !
Advertisement

తాజా వార్తలు