'డెవిల్' రేట్లకు భయపడుతున్న బయ్యర్లు

నందమూరి కళ్యాణ్ రామ్‌( Nandamuri kalyan ram ) హీరో గా రూపొందిన డెవిల్ సినిమా( Devil movie ) డిసెంబర్‌ 29 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.

ఈ సినిమా కు సంబంధించిన షూటింగ్‌ కార్యక్రమాలు పూర్తి అయ్యి చాలా రోజులు అయింది.

కానీ కొన్ని కారణాల వల్ల సినిమా విడుదల ఆలస్యం అయింది.క్రిస్మస్ కి విడుదల చేయాలని భావించినా కూడా సలార్ ఉండటం వల్ల వాయిదా వేస్తున్నట్లుగా నిర్మాతలు ప్రకటించారు.

ఇక సంక్రాంతికి విడుదల చేయాలి అనుకుంటే పెద్ద హీరోల సినిమాలు చాలా లైన్ లో ఉన్నాయి.అందుకే క్రిస్మస్ తర్వాత అంటే 29వ తారీకున విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చారు.

ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్‌ లెక్కలు ప్రస్తుతం చర్చనీయాంశం అవుతున్నాయి.అన్ని ఏరియాల్లో కూడా ఈ సినిమా కు గాను భారీ మొత్తం లో నిర్మాతలు కోట్‌ చేస్తున్న కారణంగా బయ్యర్లు విడుదలకు ముందుకు రావడం లేదు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఉత్తరాంద్ర కి గాను డెవిల్‌ సినిమా ను 10 కోట్ల కు అమ్మాలని నిర్మాత గట్టిగా నిర్ణయించుకున్నాడు.

Advertisement

దాంతో బయ్యర్లు కళ్యాణ్ రామ్‌ సినిమాకు అంత పెట్టడం చాలా రిస్క్‌.అయిదు లేదా ఆరు కోట్ల వరకు అయితే పర్వాలేదు అన్నట్లుగా వారు భావిస్తున్నారట.నైజాం ఏరియా లో కూడా అదే పరిస్థితి ఉంది.

అయితే నైజాం లో నిర్మాత సొంతంగానే సినిమా ను విడుదల చేసే విధంగా ప్లాన్‌ చేస్తున్నారు అంటున్నారు.సినిమా కి దర్శకుడు మధ్య లో వెళ్లి పోయాడు.

దాంతో నిర్మాత అయిన అభిషేక్ నామా మరియు నందమూరి కళ్యాణ్ రామ్‌ లు సినిమా ను పూర్తి చేశారు.దర్శకుడిగా అభిషేక్ నామా( Abhishek Nama ) పేరు వేయడం జరిగింది.

సినిమా బాగా వచ్చిందని మేకర్స్ నమ్మకంగా ఉన్నారు.అయితే బయ్యర్లు మాత్రం భారీ మొత్తం లో పెట్టేందుకు ముందుకు రావడం లేదు అని టాక్ వినిపిస్తోంది.

అక్కినేని ఫ్యామిలీ హీరోలకు ముందుకి వెళ్లే ఛాన్స్ లేదా??

అసలు విషయం ఏంటి అనేది తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు