బింబిసార 2 మూవీ డైరెక్టర్ ఎవరంటే..?

నందమూరి కళ్యాణ్ రామ్( Nandamuri Kalyan Ram ) హీరోగా చాలా సంవత్సరాల తర్వాత హిట్ కొట్టిన మూవీ బింబిసార.

( Bimbisara ) ఇంతకు ముందు ఈయన చేసిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ అయ్యాయి దాంతో గతేడాది వచ్చిన బింబిసారతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు నందమూరి కళ్యాణ్ రామ్.

వశిష్ఠ్ దర్శకత్వంలో( Director Vashist ) ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మించిన ఈ ఫాంటసీ ఫిల్మ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొని ఘన విజయం సాధించింది.అయితే ఈ సినిమా విడుదలకు ముందే, దీనికి సీక్వెల్ ఉంటుందని మేకర్స్ ప్రకటించారు.

కానీ సినిమా విడుదలై పది నెలలవుతున్నా, ఇంతవరకు సీక్వెల్ కి సంబంధించి ఎలాంటి అప్డేట్ లేదు.మధ్యలో బింబిసార-2( Bimbisara 2 ) నుంచి దర్శకుడు వశిష్ఠ్ తప్పుకున్నాడని వార్తలొచ్చాయి.

ఒకానొక సమయంలో అసలు ఈ సీక్వెల్ ఉంటుందా అనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి.అయితే ఈ సీక్వెల్ ఖచ్చితంగా ఉంటుందని, కానీ ప్రచారం జరిగినట్లుగానే దర్శకుడు మారనున్నాడని తెలుస్తోంది.

Advertisement

బింబిసార సక్సెస్ తో దర్శకుడు వశిష్ఠ్ కి పలు భారీ ఆఫర్లు వచ్చాయి.ప్రస్తుతం అతను మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేసే సన్నాహాల్లో ఉన్నాడు.వశిష్ఠ్ దర్శకత్వంలో చిరంజీవి సినిమా ఖరారైందని, త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానుందని అంటున్నారు.

అందుకే వశిష్ఠ్ బింబిసార-2 దర్శకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది.అయితే బింబిసార-2కి కథ మాత్రం వశిష్ఠ్ నే అందించాడని, అంతేకాదు స్క్రిప్ట్ వర్క్ లోనూ తన వంతుగా సాయం చేయనున్నాడని వినికిడి.

ఈ వార్తల నేపథ్యంలో మరి బింబిసార-2కి దర్శకుడు ఎవరనే ఆసక్తి అందరిలో నెలకొంది.

బింబిసారకి వీఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ గా వ్యవహరించిన అనిల్ పాడూరికి సీక్వెల్ దర్శకత్వ బాధ్యతలు అప్పగించాలని కళ్యాణ్ రామ్ నిర్ణయించాడట.అనిల్ దర్శకత్వంలో ఇప్పటికే రొమాంటిక్ అనే మూవీ రాగా, అది విజయం సాధించలేకపోయింది.అయినప్పటికీ అతని ప్రతిభని, వీఎఫ్ఎక్స్ పట్ల అతనికున్న పట్టుని చూసి బింబిసార-2 కి దర్శకుడిగా అనిల్ ని ఎంపిక చేసినట్లు సమాచారం.

How Modern Technology Shapes The IGaming Experience
మన భారతీయ సంప్రదాయంలో కొబ్బరికాయకు ఉన్న ప్రాధాన్యత ఏమిటి?

ఇక బింబిసార-2 నిర్మాణంలో డిస్నీ కూడా భాగస్వామి కానుందని ఇన్ సైడ్ టాక్.ఈసారి భారీ బడ్జెట్ తో రూపొందించి, పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని అంటున్నారు.

Advertisement

ప్రస్తుతం కళ్యాణ్ రామ్ డెవిల్ అనే సినిమాలో నటిస్తున్నాడు.అది పూర్తయ్యాక బింబిసార-2 పట్టాలెక్కే అవకాశముంది.

తాజా వార్తలు