ఎవ్వరూ ఊహించని రోల్ లో బాలయ్య.. అనిల్ వావ్ అనిపిస్తాడా?

నందమూరి బాలకృష్ణ అఖండ సినిమా విజయం తర్వాత మరో సినిమా ప్రకటించడమే కాకుండా చకచకా పూర్తి కూడా చేస్తున్నాడు.

ఈసారి కూడా బాలయ్య భారీ యాక్షన్ సినిమాతోనే రాబోతున్నాడు.

క్రాక్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన 107వ సినిమాను స్టార్ట్ చేసాడు.పులిచర్ల నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామా అని టీజర్ ద్వారా గోపీచంద్ చెప్పకనే చెప్పాడు.

మైత్రి మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను ఈ యువ దర్శకుడు హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నాడు.శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా కర్నూల్ లో షూటింగ్ జరుపు కుంటుంది.

ఇక ఈ సినిమా తర్వాత బాలయ్య తన 108 వ సినిమాను అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేయబోతున్నాడు.సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడి ఫుల్ ఫామ్ లో ఉన్నాడు.

Advertisement

ఇటీవలే ఈయన ఎఫ్ 3 సినిమాతో మరో హిట్ ఖాతాలో వేసుకున్నారు.ఇక ఇప్పుడు అనిల్ బాలయ్య సినిమాపై ఫోకస్ పెట్టాడు.త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.

ఈ క్రంమలోనే నిన్న ఈ సినిమా నుండి మేకర్స్ సాలిడ్ అప్డేట్ ఇవ్వడంతో నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఎగ్జైట్ గా ఉన్నారు.

నిన్న వచ్చిన అనౌన్స్ మెంట్ వీడియో చూసిన తర్వాత ఈ సినిమాలో బాలయ్యను అనిల్ ఎవ్వరూ ఊహించని పాత్రలో చూపించ బోతున్నారని.అనిల్ బాలయ్యను ట్రెండీ లుక్స్ తో సరైన మాస్ అండ్ స్టైలిష్ గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కిస్తున్నాడేమో అనే సందేహం కలుగుతుంది.మరి అనిల్ బాలయ్యను ఎలాంటి లుక్ లో ఎలాంటి పాత్రలో చూపిస్తాడో వేచి చూడాల్సిందే.

ఈ సినిమాను షైన్ స్క్రీన్ వారు నిర్మిస్తుండగా ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు.

మన చేతి రేఖలలో మార్పులు జరుగుతాయా... ఈ మార్పు దేనికి సంకేతం?
Advertisement