బాలయ్య ‘NBK108’ టైటిల్ రివీల్ కు మాస్ ప్లాన్.. టాలీవుడ్ లో ఫస్ట్ టైం ఇలా..

నందమూరి నటసింహం బాలకృష్ణ( Nandamuri Natasinham Balakrishna ) జూన్ 10న తన పుట్టిన రోజును( Birthday Balakrishna ) జరుపుకో నున్నారు అనే విషయం నందమూరి ఫ్యాన్స్ కు మాత్రమే కాదు తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా తెలుసు.

ఈ క్రమంలోనే ప్రతీ ఏడాది లానే ఈ ఏడాది కూడా బాలయ్య బర్త్ డే రోజు వచ్చే ట్రీట్స్ కోసం నందమూరి ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న తరుణంగా మేకర్స్ నుండి అదిరిపోయే న్యూస్ బయటకు వస్తూనే ఉన్నాయి.

బాలకృష్ణ ప్రజెంట్ ఫుల్ స్వింగ్ లో ఉన్నారు.ఈయన అఖండ, వీరసింహారెడ్డి సినిమాల( Akhanda, Veerasimha Reddy movie ) తర్వాత తన 108వ సినిమాను చేస్తున్నాడు.

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా బాలయ్యను ఎలా ప్రజెంట్ చేస్తారా అని ఫ్యాన్స్ ఈగర్ గా చూస్తున్నారు.ఈ సాలిడ్ ప్రాజెక్ట్ నుండి బాలయ్య పుట్టిన రోజు కానుకగా ఒక అప్డేట్ రాబోతుంది.

అంతకంటే ముందుగానే రేపు అంటే జూన్ 8న ఈ సినిమా నుండి టైటిల్ రాబోతున్నట్టు కొద్దిసేపటి క్రితమే మేకర్స్ అనౌన్స్ చేసారు.అయితే ఈ టైటిల్ అనౌన్స్ మెంట్( Title announcement ) అందరిలా కాకుండా కొత్తగా చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేసారు.ఇది బాలయ్య 108వ సినిమా కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో 108 హోర్డింగ్స్ ఏర్పాటు చేసి ఈ మాస్ టైటిల్ ను రేపు లాంచ్ చేయనున్నట్టు అనౌన్స్ చేశారు.

Advertisement

ఇప్పటి వరకు టాలీవుడ్ లో ఇలాంటి ప్రమోషన్స్ జరగలేదని మేకర్స్ సైతం చెబుతున్నారు.చూడాలి ఎలాంటి టైటిల్ ప్రకటిస్తారో.ఇక ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా.

బాలయ్య కూతురు పాత్రలో శ్రీలీల కనిపిస్తున్న విషయం విదితమే.అలాగే ఈ సినిమాలో విలన్ గా బాలీవుడ్ స్టార్ అర్జున్ రాంపాల్ నటిస్తుండగా ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ వారు నిర్మిస్తున్నారు.

ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా దసరా కానుకగా రిలీజ్ కాబోతుంది.

Shuffle : Analyse De L’expérience Mobile Et Des Paiements...
Advertisement