‘NBK109’లో ఆ సీనియర్ భామ.. ఇంతకీ త్రిష ఉన్నట్టా.. లేనట్టా?

నందమూరి నటసింహం బాలకృష్ణ ( Balakrishna ) కెరీర్ ఇప్పుడు జెట్ స్పీడ్ తో వెళ్తున్న విషయం తెలిసిందే.

ఈయన ఏ సినిమా చేసిన బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది.

ఇటీవలే మరో సినిమాతో వచ్చి హ్యాట్రిక్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో మూడు 100 కోట్ల సినిమాలను తన ఖాతాలో వేసుకుని సీనియర్ హీరోల్లో టాప్ లో ఉన్నాడు.

మరి భగవంత్ కేసరి సినిమా దసరా బరిలో నిలిచి బ్లాక్ బస్టర్ అవ్వగా వెంటనే మరో సినిమాను స్టార్ట్ చేసారు.ప్రజెంట్ బాలయ్య యంగ్ డైరెక్టర్ బాబీ ( Director Bobby ) దర్శకత్వంలో ఒక సినిమాకు ( NBK109 ) కమిట్ అయ్యాడు.

ఈ సినిమాపై అప్పుడే అంచనాలు నెక్స్ట్ లెవల్ కు చేరుకున్నాయి.

Advertisement

ఈ ప్రాజెక్ట్ లాంచ్ అవ్వగానే వెంటనే ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ కూడా స్టార్ట్ అయ్యింది.షూట్ స్టార్ట్ చేసిన రోజునే మేకర్స్ ఒక పవర్ ఫుల్ పోస్టర్ కూడా రిలీజ్ చేసి సినిమాపై అంచనాలు పెంచేశారు.ఇదిలా ఉండగా ఈ సినిమాలో నటించే హీరోయిన్స్ గురించిన వార్త గత కొన్నాళ్లుగా వైరల్ అవుతూనే ఉంది.

ఈ సినిమాలో బాలయ్య సరసన త్రిష ( Trisha Krishnan ) నటిస్తుందంటూ కొన్నాళ్లుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి.ఈ సినిమా ఫ్లాష్ బ్యాక్ లో బాలయ్యకు జోడీగా త్రిష నటిస్తుందని టాక్ రాగా ఈ వార్తల్లో నిజం లేదని ఈ రోల్ కోసం ప్రియమణిని( Priyamani ) ఫిక్స్ చేసారని తెలుస్తుంది.

ఈ రోల్ లో నటనకు ప్రాధాన్యం ఉండడంతో ప్రియమణిని సెలెక్ట్ చేసారని తెలుస్తుంది.

మరి ఈ కొత్త టాక్ లో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఈ వార్త మాత్రం నెట్టింట ఇప్పుడు వైరల్ అవుతుంది.ఏది ఏమైనా అధికారిక ప్రకటన వస్తే కానీ అసలు విషయం తెలియదు.ఇక ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ వారు ఫార్చ్యూన్ 4 ఎంటర్టైన్మెంట్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తుండగా నిర్మాతలుగా నాగ వంశీ( Nagavamshi ) త్రివిక్రమ్ భార్య సౌజన్య( Sowjanya ) వ్యవహరించ బోతున్నారు.

కొద్ది పాటి చ‌లికే వ‌ణికిపోతున్నారా? అయితే మీరివి తెలుసుకోవాల్సిందే!

థమన్ సంగీతం అందించబోతున్నారు.

Advertisement

తాజా వార్తలు