చాలా కాలం తర్వాత డాన్స్‌ చేయబోతున్న నమ్రత.. ఎందుకో తెలుసా?

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు హీరోగా రూపొందిన సరిలేరు నీకెవ్వరు చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకుని విడుదలకు సిద్దం అయ్యింది.

సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం ప్రమోషన్‌ ను జోరుగా చేస్తున్నారు.

అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా ఈ చిత్రంను దర్శకుడు అనీల్‌ రావిపూడి తెరకెక్కించాడు.ప్రస్తుతం సినిమా ప్రమోషన్స్‌ కోసం నమ్రత కూడా రంగంలోకి దిగినట్లుగా వార్తలు వస్తున్నాయి.

మామూలుగా ఎప్పుడు తెర వెనక ఉండి వ్యవహారం నడిపించే నమ్రత ఈసారి తెరపై కనిపించబోతుంది.

సాదారణంగా స్టార్‌ హీరోల పాటలకు లేదంటే సక్సెస్‌ అయిన పాటలకు కవర్‌ సాంగ్‌ అంటూ వీడియోలు చేయడం మనం చూస్తూ ఉన్నాం.అలా సరిలేరు నీకెవ్వరు సినిమాలోని హి ఈజ్‌ సో క్యూట్‌ పాటకు నమ్రత కవర్‌ సాంగ్‌ చేయబోతుందట.అంటే ఆ పాటకు నమ్రత డాన్స్‌ చేసి వీడియోను విడుదల చేయబోతుందట.

Advertisement

కొత్త సంవత్సరం కానుకగా నమ్రత తన కవర్‌ సాంగ్‌ ను విడుదల చేసి మహేష్‌ బాబు ఫ్యాన్స్‌ కు శుభాకాంక్షలు చెప్పబోతున్నట్లుగా తెలుస్తోంది.

సరిలేరు నీకెవ్వరు చిత్రంలో మహేష్‌ బాబుకు జోడీగా రష్మిక మందన్న నటించిన విషయం తెల్సిందే.అనీల్‌ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం సంక్రాంతికి ప్రేక్షకులను డబుల్‌ ఎంటర్‌టైన్‌ చేయడం ఖాయం అంటూ మహేష్‌బాబు ఫ్యాన్స్‌ చాలా నమ్మకంగా ఉన్నారు.విజయశాంతి ఈ చిత్రంతో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెల్సిందే.

ఇప్పటికే విడుదలైన పాటలు మరియు ట్రైలర్‌లు సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి.

క్రమం తప్పకుండా లిప్స్ స్టిక్ ఉపయోగిస్తున్నారా.. అయితే ప్రమాదంలో పడినట్లే..!

Advertisement

తాజా వార్తలు