అక్కా చెల్లెళ్ల మధ్య గ్యాప్.. శిల్పా శిరోద్కర్ పోస్ట్ తో పూర్తి క్లారిటీ వచ్చేసిందిగా!

బాలీవుడ్ నటి శిల్పా శిరోద్కర్‌, టాలీవుడ్ హీరోయిన్ నమ్రత శిరోద్కర్‌( Namrata Shirodkar ) ల గురించి మనందరికీ తెలిసిందే.

గత కొంతకాలంగా ఇద్దరికీ సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తున్నాయి.

అక్క చెల్లెల మధ్య గ్యాప్ వచ్చింది అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి.ఈ మేరకు తాజాగా శిల్పా శిరోద్కర్‌ చేసిన పోస్టుతో వాటికి క్లారిటీ వచ్చేసింది.

మరి ఆ వివరాల్లోకి వెళితే.కాగా శిల్పా శిరోద్కర్‌ ఇటీవలే హిందీ బిగ్‌బాస్‌ 18వ సీజన్‌కు వెళ్లొచ్చిన విషయం తెలిసిందే.

అయితే టాప్‌ 5లో ఉంటుందనుకున్న ఆమె 100 రోజుల జర్నీ తర్వాత గ్రాండ్‌ ఫినాలే వీక్‌ మధ్యలోనే ఎలిమినేట్‌ అయింది.

Advertisement

అయితే ఈ షోకు వెళ్లడానికి ముందు నమ్రతతో గొడవపడిందట.ఈ విషయాన్ని శిల్ప శిరోద్కర్‌ స్వయంగా వెల్లడించింది.బిగ్‌బాస్‌ ( Bigg Boss )కు వెళ్లేముందు నమ్రతతో గొడవైందని,రెండు వారాలు మాట్లాడుకోలేదని తెలిపింది.

అయితే ఫ్యామిలీ వీక్‌ లో నమ్రత రావాలని కోరుకుంది.కానీ నమ్రతకు బదులుగా శిల్పా కూతురు బిగ్‌బాస్‌ కు వెళ్లింది.

ఇకపోతే శిల్పాకు( Shilpa ) సపోర్ట్‌ గా ఆమె అక్కాబావ నమ్రత, మహేశ్‌ బాబు( Namrata, Mahesh Babu ) తనకు సపోర్ట్‌ చేయలేదని ప్రచారం జరిగింది.షో నుంచి వచ్చిన వెంటనే శిల్పా ఆ ప్రచారాన్ని తిప్పికొట్టింది.

నమ్రత ఎంతగా ప్రేమిస్తుందో నాకు తెలుసు.తను కచ్చితంగా నాకు సపోర్ట్‌ చేయాలని చెప్పను.

బాలయ్యకు ఇవ్వడం ఓకే.. వీళ్లకెందుకు పద్మ పురస్కారాలు ఇవ్వడం లేదు?
మహేశ్ బాబు మూవీ కోసం ప్రియాంక చోప్రా రెమ్యునరేషన్ తెలిస్తే షాకవ్వాల్సిందే!

ఇలాంటివి మా మధ్య బంధాన్ని ప్రభావితం చేయలేవు.తను నాకు మద్దతిచ్చినా, ఇవ్వకపోయినా తనేంటో నాకు తెలుసు నేనేంటో తనకు తెలుసు అని చెప్పింది.ఈ మేరకు తన అక్కతో కలిసి దిగిన ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది శిల్పా.

Advertisement

జనవరి 22న నమ్రత బర్త్‌డే సందర్భంగా శిల్ప ఇన్‌స్టాగ్రామ్‌ లో ఈ పోస్ట్‌ పెట్టింది.హ్యాపీ బర్త్‌డే.ఐ లవ్యూ సో మచ్‌.

నేను నిన్ను ఎంతగా మిస్‌ అయ్యానో అస్సలు ఊహించలేవు.నువ్వు ఎప్పటికీ నా సొంతమే అంటూ నమ్రతకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది.

తాజా వార్తలు