షేక్ హ్యాండ్ పోయే... ఇప్పుడు అంతా నమస్తేనే...!

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ఎంత ఇబ్బంది పెడుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

నాగరికత పెరుగుతున్న కొద్దీ మనుషులు వారి ఆరోగ్యాల పట్ల నిర్లక్ష్యం, అలాగే కొన్ని సంప్రదాయ పద్ధతులను మర్చిపోతూ వస్తున్నారు.

అయితే ఎప్పుడైతే కరోనా ప్రపంచాన్ని గడగడలాడించడం మొదలు పెట్టిందో.అప్పటినుంచి చాలామందిలో వారు ఎక్కడ తప్పు చేస్తున్నామో, అందుకు ఎలాంటి సర్దుబాటు చర్యలు చేసుకోవాలన్న ఆలోచనలు చేస్తున్నారు.

ఇక అసలు విషయంలోకి వెళితే.కరోనా వైరస్ నేపథ్యంలో.

భారత సంస్కృతి పై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసల జల్లులు కురిశాయి.ముఖ్యంగా సామాజిక దూరం పాటించాలనుకున్న వారు భారత దేశ విధానాలను అనుసరించడం మొదలు పెట్టారు.

Advertisement

ఇందుకు విదేశీలలో కూడా చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ఏకంగా దేశాధినేతలు కూడా వారు కలుసుకున్నప్పుడు స్వాగతం పలికే సంస్కృతిలో కూడా మార్పులు చోటు చేసుకున్నాయి.ఇందుకు సంబంధించి తాజాగా ఓ ఫోటో సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది.

ఆ ఫోటోలో ఓ దేశానికి చెందిన అధినేత మరో దేశ ప్రతినిధి కి నమస్తే చెబుతున్న విధానం పై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి.ఈ సందర్భంగా ఫ్రెంచ్ దేశాధ్యక్షుడు ఇమ్మానియేల్ మక్రాన్, జర్మనీ దేశానికి చెందిన చాన్సలర్ ఏంజెలా మార్కెల్ కు భారతీయ సంస్కృతి విధానంలో భాగంగా ఉన్న నమస్తే విధానంతో ఆవిడకు స్వాగతం తెలిపారు.

ఇందుకు సంబంధించి వీడియోను ఫ్రెంచ్ అధ్యక్షుడు తానే స్వయంగా తన అధికార ట్విట్టర్ ఖాతా ద్వారా ట్వీట్ చేశారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.

ముందు ముందు అన్నీ దేశాధినేతలు కూడా ఈ విధానాన్ని కచ్చితంగా పాటించాల్సిన రోజు ఆసన్నమైంది.

వీడియో వైరల్ : శోభనం గదిలో ఆలియా, రణ్ వీర్.. ఇదే తొలిసారి అంటూ..

Advertisement

తాజా వార్తలు