సినిమా టికెట్ల రేట్లపై నాగ వంశీ షాకింగ్ కామెంట్స్... ఆ విషయం ఎవరు చెప్పలేమంటూ?

సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ అధినేత సూర్యదేవర నాగ వంశీ( Suryadevara Naga Vamsi ) త్వరలోనే డాకూ మహారాజా( Daku Maharaj ) సినిమా ద్వార ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

డైరెక్టర్ బాబి ( Director Bobby ) దర్శకత్వంలో బాలకృష్ణ( Balakrishna ) హీరోగా నటించిన ఈ సినిమా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఈ క్రమంలోనే నాగ వంశీ ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు.అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న  నాగ వంశీ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలను పెంచేశారు.

Nagavamsi Shocking Comments On Ticket Price Details,naga Vamsi, Daku Maharaj, Ba

డైరెక్టర్ బాబి బాలకృష్ణను దృష్టిలో పెట్టుకొని ఈ కథను సిద్ధం చేశారని తెలిపారు.ఇందులో అన్ని ఎమోషన్స్ ఉన్నాయని ముగ్గురు హీరోయిన్స్ ఈ సినిమాలో నటించబోతున్నారు అంటూ సినిమాకు సంబంధించిన పలు విషయాలను తెలియజేస్తూ ఈయన సినిమాపై అంచనాలను పెంచేశారు.ఆఖండ సినిమా నుంచి వరుస విజయాలతో దూసుకుపోతున్న బాలయ్య ఈ సినిమా ద్వారా కూడా మరో మంచి సక్సెస్ అందుకోబోతున్నారని అభిమానులు కూడా భావిస్తున్నారు.

Nagavamsi Shocking Comments On Ticket Price Details,naga Vamsi, Daku Maharaj, Ba

ఇకపోతే తాజాగా నాగ వంశీ సినిమా టికెట్ల రేట్ల ( Tickets Price ) గురించి కూడా ఈ సందర్భంగా మాట్లాడారు.తాము ఏడాదిలో విడుదల అయ్యే ప్రతి సినిమాకు టికెట్ల రేట్లు పెంచమని ప్రభుత్వాలను కోరడం లేదని తెలిపారు.దేవర సినిమాకు( Devara Movie ) నేను పెట్టిన ఖర్చు ఎంత ఆ సినిమాని బయ్యర్లకు ఎంతకు అమ్మాను దాని ఆధారంగానే మేము ప్రభుత్వాన్ని సంప్రదిస్తూ ఇంత టికెట్ రేటు పెంచాలని కోరుతాము.

Advertisement
Nagavamsi Shocking Comments On Ticket Price Details,Naga Vamsi, Daku Maharaj, Ba

సినిమా టికెట్ ధరల విషయంలో ఏ రేట్ కరెక్ట్.ఏది కాదు అని ఎవరూ చెప్పలేము అంటూ వెల్లడించాడు.సినిమా పూర్తయిన తర్వాత దాన్ని బేస్ చేసుకుని టికెట్ రేటు ఉంటుందని నాగ వంశీ తెలిపారు.

ఇక ఏడాదిలో విడుదల అయ్యే అన్ని సినిమాలకు టికెట్ల రేట్లు పెంచమని మేము అడగము.ఈ ఏడాదిలో దేవర, పుష్ప 2, కల్కి సినిమాలకు టికెట్లు రేట్లు పెంచమని మాత్రమే కోరాము అంటూ ఈ సందర్భంగా ఈయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు