మీకో దండం రా నాయన....మీ తిట్లు భరించలేను ... నాగ వంశీ షాకింగ్ కామెంట్స్!

సాధారణంగా ఒక స్టార్ హీరో సినిమా విడుదల అవుతుంది అంటే చాలు ఆ సినిమా నుంచి ఏదైనా చిన్న అప్డేట్ వస్తే చాలని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు.

అందుకే నిర్మాతలు కూడా సినిమా గురించి చిన్న చిన్న అప్డేట్స్ విడుదల చేస్తూ అభిమానులను సంతోష పెట్టడమే కాకుండా సినిమాపై భారీ స్థాయిలో హైప్ పెంచుతూ వస్తారు.

ఇక తమ అభిమాన హీరో సినిమా నుంచి ఎలాంటి చిన్న అప్డేట్ కూడా బయటకు రాకపోతే అభిమానులు ఏకంగా దర్శక నిర్మాతలను టార్గెట్ చేస్తూ వారిని బెదిరించడం అలాగే వారిపై తిట్ల పురాణం మొదలు పెడుతూ ఉంటారు.

Nagavamshi Gives Big Update From Vd12 Movie Details, Vijay Devrakonda, Nagavamsh

ఇటీవల రాంచరణ్ సినిమా విషయంలో ఇదే జరిగింది.ఒక అభిమాని ఏకంగా సూసైడ్ చేసుకుంటానంటూ నిర్మాతలను బెదిరించిన సందర్భాలు కూడా ఉన్నాయి.తాజాగా ఇలాంటి అనుభవం నాగవంశీకి( Nagavamshi )కూడా ఎదురైందని తెలుస్తోంది.

నాగ వంశీ ప్రస్తుతం విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.ఇక ఈ సినిమాకు గౌతం తిన్ననూరి( Gautham Tinnanuri ) దర్శకత్వం వహిస్తున్నారు.

Advertisement
Nagavamshi Gives Big Update From Vd12 Movie Details, Vijay Devrakonda, Nagavamsh

గత కొంతకాలంగా విజయ్ దేవరకొండకు ఆశించిన స్థాయిలో సక్సెస్ లేదనే చెప్పాలి.

Nagavamshi Gives Big Update From Vd12 Movie Details, Vijay Devrakonda, Nagavamsh

ఈ క్రమంలోనే అభిమానులు గౌతం తిన్ననూరి పై పెద్ద ఎత్తున అంచనాలు పెట్టుకున్నారు.అయితే ఈ సినిమా నుంచి ఇప్పటివరకు ఒక అప్డేట్ కూడా రాకపోవడంతో నిర్మాత నాగ వంశీ పై  అభిమానులు ఫైర్ అవుతూ తిడుతున్నారు.దీంతో నాగ వంశీ స్పందిస్తూ.

తాజాగా ఓ క్రేజీ అప్డేట్ ఇచ్చారు.మీకో దండం నాయన.

మీ తిట్ల దండకం దెబ్బకు నేను గౌతమ్ ను హింస పెట్టి టైటిల్ ను లాక్ చేశా అని సోషల్ మీడియా వేదికగా విజయ్ దేవరకొండ సినిమా గురించి ఒక చిన్న అప్డేట్ ఇచ్చారు.అయితే ఈ సినిమా టైటిల్ ఏంటి అనేది త్వరలోనే రివిల్ చేయబోతున్నట్లు తెలిపారు.

వారంలో 2 సార్లు ఈ రెమెడీని ట్రై చేస్తే మెడ న‌లుపు మాయం!

మరి నాగ వంశీ ఇచ్చిన ఈ చిన్న అప్డేట్ తో బిజీ ఫ్యాన్స్ కాస్త శాంతిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు