మళ్లీ అదే పాత్రలో నాగ్.. ఈసారి ఏమవుతుందో?

అక్కినేని నాగార్జున ప్రస్తుతం సరైన హిట్స్ లేక ఇతర హీరోలతో పోల్చుకుంటే వెనకబడిపోయాడు.

నాగ్ నటించిన రీసెంట్ మూవీ మన్మధుడు 2 కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా మిగలడంతో తన నెక్ట్స్ మూవీపై ఫోకస్ పెడుతున్నాడు నాగ్.

అయితే ఇంకా ఎలాంటి సినిమాను ఓకే చేయని నాగ్, తన నెక్ట్స్ మూవీని ఓ కొత్త దర్శకుడితో చేయబోతున్నట్లు తెలుస్తోంది.సోలోమన్ అనే కొత్త దర్శకుడు చెప్పిన కథకు నాగ్ బాగా ఇంప్రెస్ అయ్యి అతడి డైరెక్షన్‌లో సినిమాకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.

ఇక ఈ సినిమాలో నాగ్ పాత్రపై ఇండస్ట్రీ వర్గాల్లో ఓ వార్త హల్‌చల్ చేస్తోంది.ఈ సినిమాలో నాగ్ మరోసారి కాప్ అవతారంలో మనకు కనిపిస్తాడట.

పవర్‌ఫుల్ కాప్ కథను సోలోమన్ నాగ్‌కు వినిపించినట్లు తెలుస్తోంది.ఈ సినిమాతో మరసారి సక్సెస్ ట్రాక్‌ను అందుకోవాలని నాగ్ ప్రయత్నాలు చేస్తున్నాడు.

Advertisement

రియలిస్టిక్ కథతో ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపారు.ఇక ఈ సినిమాను నాగ్ స్వయంగా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై ప్రొడ్యూస్ చేయనున్నాడు.

ఈ సినిమాను వీలైనంత త్వరగా మొదలుపెట్టేందుకు నాగ్ అండ్ కో రెడీ అవుతున్నారు.

Advertisement