ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను కూల్చేయడం వల్ల నాగార్జునకు ఏకంగా అన్ని రూ.కోట్ల నష్టమా?

స్టార్ హీరో అక్కినేని నాగార్జునకు( Akkineni Nagarjuna ) సంబంధించిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ( N Convention Center )ను కూల్చేయడం తాజాగా సోషల్ మీడియా వేదికగా సంచలనం సృష్టించింది.

నాగార్జున ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను నిర్మించారని అందుకే ఆ నిర్మాణాన్ని కూల్చివేశామని హైడ్రా అధికారులు చెబుతున్నారు.

ఎన్ కన్వెన్షన్ మొత్తం విలువ 400 కోట్ల రూపాయలు అని సమాచారం అందుతోంది.ఎన్ కన్వెన్షన్ ద్వారా నాగార్జునకు ఏడాదికి దాదాపుగా 100 కోట్ల రూపాయల రేంజ్ లో ఆదాయం వస్తోందని సమాచారం.

తుమ్మిడికుంట చెరువులో( Thummidikunta pond ) కొన్ని ఎకరాలను ఆక్రమించి నాగార్జున ఈ నిర్మాణాన్ని చేపట్టారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.నాగార్జున కోర్టులో ఈ ఘటన గురించి పోరాడుతున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఏం జరగనుందో చూడాల్సి ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

నాగార్జున ఈ ఘటన విషయంలో ఒకింత సీరియస్ గా ఉన్నారని తెలుస్తోంది.మరోవైపు నాగార్జునను బిగ్ బాస్ షో ( Bigg Boss Show )నుంచి తప్పించాలనే డిమాండ్ వినిపిస్తుండటంపై కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.పదేపదే నాగర్జునను టార్గెట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

నాగార్జునకు తప్పు చేయలేదని ప్రూవ్ చేసుకునే సమయం అయినా ఇవ్వాలని కామెంట్లు వినిపిస్తున్నాయి.

నాగార్జున ఫ్యామిలీని ఈ మధ్య కాలంలో ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారని అక్కినేని ఫ్యామిలీపై ఇంత విష ప్రచారం ఎందుకని కామెంట్లు వినిపిస్తున్నాయి.నాగార్జున ఈ భారీ నష్టాన్ని భర్తీ చేయడానికి ఏ విధంగా అడుగులు వేయనున్నారో చూడాల్సి ఉంది.నాగార్జున ప్రస్తుతం కుబేర సినిమాతో పాటు ప్రాజెక్ట్ తో బిజీగా ఉన్నారు.

ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత ఘటన నాగార్జున వ్యక్తిగత జీవితంపై కూడా తీవ్రస్థాయిలో ప్రభావం చూపుతోందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

100 ఎకరాల విస్తీర్ణంలో భారీ స్టూడియో నిర్మాణం.. పవన్ చొరవతోనే సాధ్యం!
Advertisement

తాజా వార్తలు