ఔను... నాన్న చాలా ఇంట్రెస్ట్‌గా ఉన్నాడు, నేను కూడా సరే అన్నాను

నాగార్జున ప్రస్తుతం మన్మధుడు 2 చిత్రం షూటింగ్‌లో ఉన్నాడు.భారీ అంచనాల నడుమ ఈ చిత్రంను రాహుల్‌ రవీంద్రన్‌ తెరకెక్కిస్తున్నాడు.

ఈ చిత్రంను నాగార్జున స్వయంగా నిర్మించబోతున్నాడు.చిలసౌ వంటి విభిన్నమైన చిత్రాన్ని తెరకెక్కించిన రాహుల్‌ రవీంద్రన్‌ ఈ చిత్రంలో నాగార్జునను చాలా విభిన్నంగా చూపించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు.

మన్మధుడు చిత్రానికి ఈ చిత్రానికి సంబంధం లేకున్నా కూడా కథ రీత్యా మన్మధుడు 2 అనే టైటిల్‌ అయితేనే బాగుంటుందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.అతి త్వరలోనే సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ రాబోతుంది.

ఈ సమయంలోనే నాగార్జున బంగార్రాజు సినిమాకు సంబంధించిన వార్తలు వస్తున్నాయి.

Advertisement

మన్మధుడు 2 చిత్రంలో నటిస్తూనే మరో వైపు బంగార్రాజును చేయాలని నాగార్జున భావిస్తున్నాడు.రెండేళ్లుగా బంగార్రాజు చిత్రం స్క్రిప్ట్‌ వర్క్‌ జరిగింది.ఎట్టకేలకు అది పూర్తి అయ్యింది.

ఆ చిత్రంలో నాగార్జునతో పాటు నాగచైతన్య కూడా కనిపించబోతున్నాడు.తాజాగా బంగార్రాజు చిత్రం గురించి నాగచైతన్య మీడియాతో మాట్లాడుతూ ఆ వార్తలు నిజమే అని, అయితే ఇంకా ఎలాంటి క్లారిటీ మాత్రం ఇవ్వలేను అంటూ చెప్పుకొచ్చాడు.

నాన్న చాలా ఆసక్తిగా బంగార్రాజు చిత్రం కోసం ఎదురు చూస్తున్నారు.ఆయన కోసం నేను కూడా బంగార్రాజు చిత్రంలో నటించాలని భావిస్తున్నాను అన్నాడు.

బంగార్రాజు పాత్ర సోగ్గాడే చిన్న నాయన సినిమా నుండి తీసుకోవడం జరిగింది.ఆ పాత్ర చుట్టు కథను అల్లబోతున్నారు.సోగ్గాడే చిన్న నాయన సినిమాకు బంగార్రాజుకు అసలు సంబంధం ఉండదని చైతూ చెప్పుకొచ్చాడు.

మంచి పాత్ర అవ్వడంతో బంగార్రాజు చిత్రంను చేసేందుకు తాను కూడా ఆసక్తిగా ఉన్నాను అన్నాడు.ఆగస్టు నుండి ఆ సినిమా షూటింగ్‌లో పాల్గొనబోతున్నట్లుగా చైతూ ప్రకటించాడు.ప్రస్తుతం ఈయన వెంకీ మామ చిత్రంలో వెంకటేష్‌తో కలిసి నటిస్తున్నాడు.

Advertisement

రేపు మజిలీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

తాజా వార్తలు