శోభితతో పెళ్లి గురించి నోరు విప్పిన నాగచైతన్య.. పెళ్లి ఎక్కడ జరగనుందంటే?

నాగచైతన్య, శోభిత ( Naga Chaitanya, Sobhita )పెళ్లి గురించి, పెళ్లి ఎక్కడ ఎప్పుడు జరగనుందనే విశేషాల గురించి అభిమానులు ఒకింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ విషయాలకు సంబంధించి పూర్తిస్థాయిలో కాకపోయినా నాగచైతన్య నుంచి కొంతమేర స్పష్టత వచ్చేసింది.

శోభితతో పెళ్లి ఎక్కడ అనే ప్రశ్నకు స్పందిస్తూ చైతన్య ఒకింత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.పెళ్లంటే నా మనస్సుకు దగ్గరైన వాళ్లంతా ఉండాలని ఆయన చెప్పుకొచ్చారు.

మన సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం పెళ్లి చేసుకోవడం అంటే నాకు ఇష్టమని ఆయన పేర్కొన్నారు.పెళ్లి ఎప్పుడు జరుగుతుందో ఎక్కడ జరుగుతుందో త్వరలోనే ఆ విషయాలను వెల్లడిస్తానని చైతన్య చెప్పుకొచ్చారు.

అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం రాజస్థాన్( Rajasthan ) లో చైతన్య శోభిత పెళ్లి జరిగే అవకాశాలు ఉన్నాయి.

Advertisement

పరిమిత సంఖ్యలో బంధుమిత్రుల మధ్య ఈ పెళ్లి వేడుక ( wedding ceremony )జరగనుందని ఈ పెళ్లి వేడుక కోసం ఒకింత భారీ స్థాయిలోనే ఖర్చు చేయనున్నారని సమాచారం అందుతోంది.నాగచైతన్య శోభిత జోడీ బాగుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.నాగచైతన్య పారితోషికం 15 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని సమాచారం అందుతోంది.

తండేల్ సినిమాపై ప్రస్తుతం నాగచైతన్య దృష్టి ఉంది.

తండేల్ సినిమాలో రాజు అనే జాలరి పాత్రలో చైతన్య కనిపించనున్నారని సమాచారం అందుతోంది.తండేల్ సినిమా చైతన్యకు భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను అందించడం ఖాయమని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.తండేల్ సినిమా రిలీజ్ డేట్ విషయంలో మాత్రం ఒకింత కన్ఫ్యూజన్ నెలకొంది.

తండేల్ సినిమా ఎప్పుడు విడుదలైనా హిట్ గా నిలుస్తుందని ఫ్యాన్స్ భావిస్తుండటం గమనార్హం.సాయిపల్లవి ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుండగా లవ్ స్టోరీ సినిమా తర్వాత ఈ కాంబోలో రిపీట్ అవుతున్న సినిమా ఇదే కావడం గమనార్హం.

లైఫ్ లో ఎవరినీ నమ్మొద్దు.. వైరల్ అవుతున్న బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు!
Advertisement

తాజా వార్తలు