స్పోర్ట్స్ చిత్రానికి ఓటేసిన అశ్వధ్ధామ హీరో

యంగ్ హీరో నాగశౌర్య ప్రస్తుతం తన తాజా చిత్రం అశ్వధ్ధామ రిలీజ్‌పై ఫుల్ ఫోకస్ పెట్టాడు.

ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా కథను కూడా నాగశౌర్య రాసుకోవడంతో ఈ సినిమా ఎలా ఉంటుందా అనే ఆసక్తి అందరిలో మొదలైంది.

కాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్, ట్రైలర్లు సినిమాపై అంచనాలు పెంచాయి.అయితే ఈ సినిమా తరువాత శౌర్య తన నెక్ట్స్ మూవీని కూడా ప్లాన్ చేస్తూ తన సత్తా చాటుతున్నాడు.

సినిమా సినిమాకు మధ్య వెరైటీని చూపుతు తన నెక్ట్స్ మూవీని ఓ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ మూవీగా తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు ఈ హీరో.విలువిద్య ఆట బ్యాక్‌డ్రాప్‌లో ఈ మూవీ ఉండనున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమా కోసం నాగశౌర్య తన లుక్‌ను కూడా పూర్తిగా మార్చేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.అయితే ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

Advertisement

నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్స్, ఏషియన్ సినిమాస్ సంయుక్తంగా ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయనున్నట్లు తెలుస్తోంది.కాగా ఈ సినిమాకు డైరెక్టర్ ఎవరనే విషయం కూడా తెలియాల్సి ఉంది.

ఏదేమైనా నాగశౌర్య ప్రస్తుతం తనలోని విభిన్న షేడ్స్‌ను చూపించేందుకు రెడీ అవుతున్నాడు.మరి అశ్వధ్ధామ సినిమాతో మనోడు ఎలాంటి హిట్ కొడతాడో చూడాలి.

Advertisement