అంటే నాగ శౌర్య ఆ సినిమా చూడలేదా..!

ఒకే లాంటి కథతో రెండు సినిమాలు వస్తే.ఆ సినిమా చూసి ఈ సినిమా తీశారా అన్న టాక్ రాకమానదు.

ఎప్పుడో తీసిన సినిమా కథ పోలిన కథతో వస్తేనే ఈ సినిమా ఫలానా సినిమాలా ఉంది అంటారు అలాంటిది 3, 4 నెలల క్రితం రిలీజైన సినిమా కథలాంటి కథతోనే మరో సినిమా వస్తే ఆడియన్స్ ఎలా ఫీల్ అవుతారు.ఇంతకీ ఈ లీడ్ అంతా దేనికి అంటే నిన్న రిలీజైన నాగ శౌర్య కృష్ణా వ్రిందా విహారి సినిమా గురించి అన్నమాట.

సినిమా చూసిన ఎవరైనా సరే ఇదేంది నాని అంటే సుందరానికీ సినిమా మళ్లీ తీశారు అన్నట్టు ఉంటుంది.నాని, నజ్రియా కలిసి నటించిన అంటే సుందరానికీ సినిమాలో నాని పాత్రకి కృష్ణా వ్రిందా విహారి సినిమాలో నాగ శౌర్య పాత్రకి చాలా దగ్గర సంబంధం ఉంది.అంతేకాదు రెండు కథల్లో చాలా దగ్గర పోలికలు ఉన్నాయి.

మరి ఎవరు ముందు ఈ కథ అనుకున్నారో కానీ నాని అంటే సుందరానికీ, నాగ శౌర్య కృష్ణా వ్రిందా విహారి సినిమా కథలు ఒకే రకంగా ఉండటంతో ఆడియన్స్ షాక్ అయ్యారు.నిన్న రిలీజైన 3 సినిమాల్లో నాగ శౌర్య సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.

Advertisement
కొద్ది పాటి చ‌లికే వ‌ణికిపోతున్నారా? అయితే మీరివి తెలుసుకోవాల్సిందే!