చైతు కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్..!

నాగ చైతన్య హీరోగా టాలెంటెడ్ డైరక్టర్ విక్రం కె కుమార్ డైరక్షన్ లో వస్తున్న సినిమా థ్యాంక్యూ.

దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో నాగ చైతన్య సరసన రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తుంది.

థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా సాంగ్స్ ఇప్పటికే శ్రోతలను అలరిస్తున్నాయి.జూలై 22న రిలీజ్ ఫిక్స్ చేసిన ఈ సినిమాని టాలీవుడ్ లో ఉన్న కొంతమంది డైరక్టర్స్ కి చూపించారట.

సినిమా చూసిన వాళ్లు నాగ చైతన్యని తెగ పొగిడేస్తున్నారు.సినిమాలో నాగ చైతన్య తన కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారని అంటున్నారు.

లేటెస్ట్ గా రైటర్ కమ్ డైరక్టర్ బివిఎస్ రవి కూడా నాగ చైతన్య థ్యాంక్యూ మూవీ గురించి ట్వీట్ చేశారు.సినిమా చూసిన తను నాగ చైతన్యపై పొగడ్తల వర్షం కురిపించారు.

Advertisement

సినిమాలో చైతు నటన సూపర్ అని ఆయన కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇదే అని అన్నారు.ఇప్పటివరకు నాగ చైతన్య చేసిన సినిమాల్లో ఇదే బెస్ట్ గా ఉంటుందని అన్నారు.

అంతకుముందు కెరియర్ లో ప్రయోగాలు చేసిన నాగ చైతన్య లవర్ బోయ్ ఇమేజ్ తో మంచి సినిమాలు చేస్తున్నాడు.మజిలీ నుంచి బంగార్రాజు వరకు వరుస హిట్లతో దూసుకెళ్తున్నాడు.స్టోరీ సెలక్షన్ విషయంలో కూడా నాగ చైతన్య చాలా ఫోకస్ గా ఉంటున్నారని తెలుస్తుంది.

థ్యాంక్యూ సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న నాగ చైతన్య ఆ సినిమాతో పాటుగా విక్రం కె కుమార్ తో ధూత అనే వెబ్ సీరీస్ కూడా చేస్తున్నాడు.నెట్ ఫ్లిక్స్ కోసం చేస్తున్న ఈ ధూత వెబ్ సీరీస్ కూడ క్రేజీగా ఉండబోతుందని తెలుస్తుంది.

 సినిమాలే కాదు వెబ్ సీరీస్ లతో కూడా నాగ చైతన్య అదరగొట్టనున్నాడని చెప్పొచ్చు.

Bet365: Mejores Juegos Y Slots En Argentina (AR) — Análisis Comparativo
Advertisement